14న మెడికల్ షాపుల బంద్

రాజమండ్రిలో 4షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోయే ఆన్‌లైన్‌/ ఇ-ఫార్మసీ విధానానికి నిరసనగా బుధవారం (14) మెడికల్‌ షాపుల బంద్‌ పాటిస్తారు. సంఘ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ది రాజమండ్రి కెమిష్ట్సు అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీ కె.ఫణి నాగేశ్వరరావు, కార్యదర్శి శ్రీ బొండాడ వీరబాబు, కోశాధికారి శ్రీ టి.డి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొత్త చలపతిరావు, మాజీ ఫెడ్‌ ట్యాప్‌ అధ్యక్షులు బి.రాజా, హోల్‌సేల్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.శ్రీనివాసరావు, కె.రంగబాబు, పి.బాల పాల్గొన్నారు. బంద్‌ దృష్ట్యా నగరంలో నాలుగు మెడికల్‌ షాపులు తెరచి ఉంచుతారు. శ్రీ లక్ష్మీ గణపతి మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌- 95051 19595, సాయి లక్ష్మీ మెడికల్స్‌-93966 98989, వెంకటకృష్ణ మెడికల్స్‌-94903 52174, అమర్‌ మెడికల్స్‌-93914 64858 తెరిచి ఉంచుతారు. అలాగే 98662 15915, 98667 36799, 99890 32654, 98497 01833, 99492 68618, 93966 61666 నెంబర్లను అత్యవసర సమయంలో అందుబాటులో వుంటారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.