16నుంచి ధనుర్మాసోత్సవాలు

శ్రీ భూనీళా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో
రాజమహేంద్రవరం సీతంపేట జమిందార్‌ మెట్టపై చైతన్య హాస్పటల్‌ పక్కన ఉన్న అపార్ట్ మెంట్స్ దగ్గర గల శ్రీ భూనీళా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో శుక్రవారం(16) నుంచి జనవరి 14 వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు శ్రీ శ్రిఘాకొళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం తెలిపారు. తరతరాలుగా పెద్దలు ఆచరిస్తూ వస్తున్న ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి వారు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల్లోని భక్తులను తరింపజేస్తున్నారని, చిన జీయర్‌ స్వామి, త్రిదండి అహోబిల జీయర్‌స్వామి వార్ల మంగళాశాసనాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఈ ఏడాది ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 5.3గంటలనుంచి సుప్రభాత సేవ, అర్చన, తిరుప్పావై సేవాకాలం, ఉదయం 7గంటలకు తిరుప్పావై పాసుర విన్నపం , మంగళాశాసనం తీర్ధ ప్రసాద గోష్టి జరుగుతాయి. 31న ఉదయం 5గంటలకు నాయగనామ్ నిష్ణా, జనవరి 7వ తేదీన ఉదయం 5గంటలకు మారిమలై, 8వ తేదీన ముక్కోటి ఏకాదశి ,13న భోగినాడు శ్రీ గోదా రంగనాధుల కల్యాణోత్సవం జరుగుతాయి. శ్రీ నండూరి వెంకటరమణ, శ్రీమతి శాంతిశ్రీ తెలిపారు. భక్తులు ఈ ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని శ్రీగోదా రంగనాథుల, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల అనుగ్రహాన్ని , జీయర్‌ స్వామివార్ల మంగళా శాసనాలను పొంది తరించాలని శ్రీ శివరామసుబ్రహ్మణ్యం కోరారు

.dnanurmasam36

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ra&aqs=chrome.1.69i60j69i59j69i60l2j69i57j69i59.2235j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=srighakollapu%20sivarama%20subrahmanyam

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.