19న బ్రాహ్మణ ఉపకార వేతన అవగాహన సదస్సు

బ్రాహ్మణ విద్యార్ధులకు అందించే ఉపకార వేతనాలపై రాజమండ్రి విక్రమ హాలులో సెప్టెంబర్ 19 శనివారం సాయంత్రం 4.30 నుంచి  6.30 వరకు ఎపి  బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ ఆధ్వర్యాన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీ భమిడిపాటి శ్రీకృష్ణ , ఎపి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ చల్లా ప్రవీణ్ ఓ ప్రకటనలో తెల్పారు . కార్పోరేషన్ చైర్మన్ శ్రీ చెంగపల్లి వెంకటశాస్త్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తారని వారు తెల్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ ఏర్పాటుచేసి , నిధులు కేటాయించిన నేపధ్యంలో స్కాలర్ షిప్స్ మంజూరు చేసే క్రమంలో విద్యార్ధుల  దరఖాస్తులను పూర్తిచేసి పంపడానికి గల మార్గ దర్శకాలను చైర్మన్ వివరిస్తారని శ్రీ శ్రీకృష్ణ , శ్రీ ప్రవీణ్ తెల్పారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులంతా వినియోగించుకోవాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి శ్రీ రాణి శ్రీనివాస్ , కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ నృసింహదేవర వెంకట విశ్వనాధం , పాలూరు శ్రీనివాస్ , హోతా రవి , ఆకెళ్ళ శ్రీనివాస్ , బ్రాహ్మణ సంఘ కార్యదర్శి శ్రీ ప్రసాద్ , శ్రీ చక్రవర్తి ఏర్పాట్లలో సహకరిస్తున్నారు . వివరాలకు శ్రీ భమిడిపాటి శ్రీకృష్ణ 98483 49640, శ్రీ చల్లా ప్రవీణ్  9866314181 లను సంప్రదించవచ్చు.

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.