హిందూ సమాజంలో మూడు రోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు
రాజమండ్రి హ\టి నగర హిందూ సమాజంలో ఆంద్ర భీష్మ న్యాపతి సుబ్బారావు పంతులు రోటరీ కళా వేదికపై నవంబర్ 20నుంచి 22వ తేదీ వరకు మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన బుర్ర కథల పోటీలు జరుగుతాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బూర విజయ సారధి – గోపీచంద్ స్మారక కళా పరిషత్ పక్షాన శ్రీ బూర రామచంద్రరావు ఆధ్వర్యాన నిర్వహించే ఈపోటీల ప్రదేశానికి కీ శే మండా సుబ్బి రెడ్డి కళా ప్రాంగణంగా నామకరణం చేసారు. గత సంవత్సరం నిర్వహిచిన ఈ పోటీలకు మంచి స్పందన రావడంతో ఈసారి మరింత హుషారుగా పోటీలు నిర్వహిస్తున్నారు. 20,21,22 తేదీలలో ప్రతిరోజూ సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీ బూర రామచంద్రరావు శుక్రవారం ఉదయం హిందూ సమాజ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు సర్వశ్రీ ప్రసాదుల గురుమూర్తి , గొర్రెల రాము , లంక హరిప్రసాద్ , బండారు రామారావు , జామాని లక్ష్మీ నారాయణ , పట్నాల సాంబమూర్తి , పంతాడి రమణ, సువ్వాడ అప్పలరాజు , బూర భాస్కరరావు , వెన్ను పైడిరాజు , గొలగాని వీర వెంకట సత్యనారాయణ , తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి , కృష్ణా , గుంటూరు , శ్రీకాకుళం , కర్నూల్ గుంటూరు జిల్లాల నుంచి 9బుర్ర కథ దళాలు పోటీల్లో పాల్గొంటాయి .
Related posts
Leave a Reply
Leave a Reply
You must be logged in to post a comment.