20న మద్దూరి అన్నపూర్ణయ్య జయంతి – Madduri Annapoornayya birth anniversary

మారిశెట్టి వెంకట రామారావుకి  అన్నపూర్ణయ్య  అవార్డు
madduri annapoornayya garu 
  స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య జయంతి వేడుకలను మార్చి 20న రాజమహేంద్రవరం జెండా పంజా రోడ్ లోని అన్నపూర్ణయ్య పార్కులో అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యాన జరుగుతాయి. ఈ సందర్బంగా చాంబర్ మాజీ అధ్యక్షులు,ఎస్వీ మార్కెట్ మాజీ అధ్యక్షులు శ్రీ మారిశెట్టి వెంకట రామారావుకి శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డు ప్రదానం చేస్తారు. ఈమేరకు సమితి అధ్యక్షులు శ్రీ కొణతం సుబ్బారావు అధ్యక్షతన శ్రీ కూరెళ్ల హనుమంతరావు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమితి సమావేశం తీర్మానించింది. ప్రధాన కార్యదర్శి శ్రీ బెజవాడ రంగారావు,శ్రీ కూరెళ్ల హనుమంతరావు,యర్రా కేదారేశ్వర రావు,కోడూరి సుబ్రహ్మణ్యం కూనపరెడ్డి శ్రీనివాస్,పిల్లాడి రామకృష్ణ,కె సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవార్డు ప్రదానంతో పాటు పురప్రముఖులైన సర్వశ్రీ తోలేటి ధనరాజు ,ఆండ్ర నమః శివాయ,తవ్వల మోహనరావు,కోలా వెంకటేశ్వరరావు,తొక్కుల రామాంజనేయులు,పడాల చిన్నబ్బాయి , దేవనశెట్టి నాగేశ్వరరావు,షేక్ జహంగీర్ మస్తాన్,లకు స్మారక పురస్కారాలతో సత్కరించాలని సమావేశం నిర్ణయించింది. 
madduri50

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.