24గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవం ప్రారంభం

ghantasalaghantasala2ghantasala3ghantasala4ghantasala5ghantasala6ghantasala7

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకి నివాళిగా 24 గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవం రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో హైదరాబాద్‌ కిన్నెర ఆర్ట్‌ ధియేటర్స్‌ నిర్వహణలో శనివారం రాత్రి 8 గంటలకు గాన గంధర్వుడు, పద్మభూషణ్‌ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమాన్ని ఘంటసాల పాట ఆలపించడం ద్వారా ప్రారంభించారు. శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యం లోని పాటను ఆయన ఆలపించారు. తర్వాత మాధవ పెద్ది సురేష్ , జి ఆనంద్, బి ఎ నారాయణ ,  శ్రీపాద జిత్ మోహన్ మిత్రా , సురేఖ  మూర్తి , సాయి స్వామి తదితరులు గీతాలు ఆలపించారు. పలువురు సంగీత ప్రియులు , ఘంటసాల అభిమానులు పాల్గొని  ఆపాత మధురాలను ఆస్వాదించారు.  14వ తేదీ రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది.  ముందుగా సభ జరిగింది.

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.