26 నుంచి అంతర్ జిల్లాల వాలీబాల్‌ పోటీలు

4రోజుల పాటు  ఆర్ట్స్ కాలేజి మైదానంలో క్రీడా సందడి

valibal
ఈనెల 26వ తేదీ నుంచి నాలుగురోజులపాటు రాష్ట్రస్థాయి వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ పోటీలు తూర్పుగోదావరి జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌, సిటీ వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లోని పరిమి రామచంద్రరావు మెమోరియల్‌ ఫ్లడ్‌ లైట్‌ వాలీబాల్‌ కోర్టులో ఘనంగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. క్రీడా నిపుణుల సూచనల మేరకు అదనంగా మూడు కోర్టులను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఎపి పరిధిలో తొలిసారి జరిగే ఈ పూతీలకు 13 జిల్లాల నుండి 13 పురుషుల జట్లు, 13 మహిళా జట్లు హాజరుకానున్నాయి ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఉదయం ఆర్ట్స్ కాలేజి మైదానంలోని డాక్టర్ పరిమి రామచంద్రరావు ఫ్లడ్ లైట్ వాలీ బాల్ కోర్టులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో .రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీత శ్రీ అరిగెలపూడి రమణారావు, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పరిమి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడారు. ఉపాధ్యక్షులు జి.నారాయణరాజు, జి.బంగార్రాజు, మోహన్‌బాబు, రంగ, ఆబోతుల శ్రీనివాస్‌, జెస్సి తదితరులు పాల్గొన్నారు.
గత ఏడాది రాష్ట్రస్థాయి పోటీలు భీమవరంలో నిర్వహించగా, ఇప్పుడు రాజమండ్రిలో నిర్వహిస్తున్నామని రమణారావు తెలిపారు. 13 టీమ్‌లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్‌ కం సూపర్‌లీగ్‌ అండ్ నాకౌట్‌ పద్ధతిలో పోటీలు ఉంటాయని వివరించారు. నాకౌట్‌కు ఎనిమిది టీమ్‌లు చేరతాయని, సెమీ ఫైనల్‌కు నాలుగు టీమ్‌లు చేరి ఫైనల్‌లో రెండు టీమ్‌లు తలపడతాయన్నారు. జాతీయ వాలీబాల్‌ ఫెడరేషన్‌ నియమ నిబంధనల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తామని ఆయన చెబుతూ , ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని ఎంపిక చేసి వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలకు పంపిస్తామని ఆయన సూచించారు. రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేసేందుకు మాజీ జాతీయ వాలీబాల్‌ క్రీడాకారులు ప్రభాకర్‌రాజు, సింగారావు, తులసిరెడ్డి, రాష్ట్ర అసోసియేషన్‌ ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు వస్తారని ఆయన తెల్పారు. 20 మంది క్వాలిఫైడ్‌ రిఫరీలు, లోకల్‌ రిఫరీలు చాంపియన్‌షిప్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తారని, వీరితోపాటు టెక్నికల్‌ కమిటీ పనిచేస్తుందని శ్రీ రమణారావు సూచించారు.
పరిమి వాసు మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి వల్ల వాలీబాల్‌ కోర్టును నిర్మించడం జరిగిందన్నారు. 26 నుంచి జరగబోయే టోర్నమెంట్‌లో 13 జిల్లాల నుంచి 350 మంది కళాకారులు, 100 మంది ప్రతినిధులు హాజరవుతారని, ఇప్పుడున్న కోర్టుతోపాటు మరో మూడు తాత్కాలిక కోర్టులను నిర్మించి ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం నాలుగురోజుల్లో 54 మ్యాచ్‌లు ఉంటాయని వివరించారు. రాజమండ్రికి క్రీడా స్టేడియం అవసరమని ఆయన చెబుతూ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, మేయర్‌ రజనీ శేషసాయిలను కలిసి స్టేడియం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తానని చెప్పారు. ఈ దశలో శ్రీ రమణారావు జోక్యం చేసుకుంటూ , ఎపి సిఎమ్ శ్రీ చంద్రబాబు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నందున తప్పనిసరిగా స్టేడియం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. గతంలో కాకినాడలో వాలీబాల్‌ అకాడమీ ఉండేదని, దానిని రీకాల్‌ చేస్తున్నందున రాజమండ్రిలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని శ్రీ పరిమి వాసు పేర్కొన్నారు. రానున్న రెండు, మూడేళ్ళలో జాతీయస్థాయి టోర్నమెంట్‌ను నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ క్రీడోత్సవాలకు మంత్రులు, జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.