5రాష్ట్రాల ఎన్నికల్లో…..

తమిళనాట మళ్ళీ ‘జయ’ – బెంగాల్‌ ‘మమత’
అసోంలో తొలిసారి ‘కమలం’ – కేరళలో వామపక్ష కూటమి
పాండిచ్చేరిలో మాత్రం కాస్తఊరట ‘
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ బెంగాల్‌లలో ఎఐఎడిఎంకె, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోగా అసోం, కేరళలలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో 15 ఏళ్ళ కాంగ్రెస్‌ పాలనకు చరమ గీతం పాడి తొలిసారిగా పాగ వేసిన భారతీయ జనతా పార్టీ అక్కడ మెజార్టీ స్ధానాలతో అధికారాన్ని కైవసం చేసుకుంది . ఇక కేరళలో కాంగ్రెస్‌ సారధ్యంలోని యుడీఎఫ్‌ వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. అయితే పాండిచ్చేరిలో ఫలితాలు ఒక్కటే కాంగ్రెస్‌కు కాస్త ఊరటనిచ్చాయి. అక్కడ రంగస్వామి కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చవి చూడగా కాంగ్రెస్‌, డిఎంకె కూటమి విజయపధంలో దూసుకెళ్లింది.
ఎగ్జిట్ పోల్స్ కాదని జయకేతనం

jaya
తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత సారధ్యంలోని ఎఐఎడిఎంకె ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలక్రిందులు చేస్తూ విజయభేరి మోగించి వరుసగా రెండవ సారి అధికార పీఠాన్ని చేపడుతోంది. ఇక అధికారంలో ఉన్న పార్టీ తదుపరి ఎన్నికల్లో తమ అధికారం నిలబెట్టుకున్న చరిత్ర తమిళనాడులో కొత్తకాదు. స్వాతంత్య్రం అనంతరం జరిగిన ఎన్నికలు మొదలుకొని … 1967 వరకు తమిళనాట కాంగ్రెస్‌ హవా కొనసాగింది. 1967లో కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడి అణ్నాదురై నేతృత్వంలోని డీఎంకే అధికారం చేపట్టింది. అణ్నాదురై మరణానంతరం ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971లో జరిగిన ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు.డీఎంకీని వీడి అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఎంజీఆర్‌ 1977లో శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపట్టి 1980, 1984 ఎన్నికల్లో తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత ఎంజీఆర్‌ మరణానంతరం జరిగిన ఏ శాసనసభ ఎన్నికల్లోనూ తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండో సారి అధికారాన్ని నిలబెట్టుకోలేదు. 1984 తరువాత.. 1989లో డీఎంకే,1991 – అన్నా డీఎంకే, 1996 – డీఎంకే, 2001- అన్నా డీఎంకే, 2006- డీఎంకే, 2011- అన్నా డీఎంకే విజయం సాధించాయి. ఇలా గత మూడు దశాబ్దాలుగా జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తమిళనాట తిరిగి అధికారం చేపట్టలేదు. ఎంజీఆర్‌ ఆ తరువాత 2016లో ఆ రికార్డును జయలలిత తిరిగి లిఖించారు.
13వ సారి గెలిచిన కరుణ …

karuna
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి విజయం సాధించారు. దీంతో ఈయన వరుసగా 13వ సారి శాసన సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. తిరువారూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. పోటీ చేసిన అన్ని శాసనభ ఎన్నికల్లోనూ విజయం సాధించడం ద్వారా కరుణానిధి సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే ఆ పార్టీ ఓటమి చెందడంతో పాపం ఎలాగైనా సిఎమ్ కావాలనే ఆయన కోరిక నెరవేరలేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు తప్పాయి.
పశ్చిమ బెంగాల్‌లో దీదీ

mamata
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ మళ్ళీ అధికార పీఠాన్ని దక్కించుకోబోతోంది. అక్కడ వామపక్షాల కంచుకోటను బద్ధలుకొట్టి అధికారాన్ని చేపట్టిన మమతా బెనర్జీ ప్రస్తుతమున్న బలం కంటే ఈ ఎన్నికల్లో మరింతగా బలం పెంచుకుని రెండవ సారి సిఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. తనదైన శైలిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థులు తమ గురించి ఎన్నో అసత్యపు ప్రచారాలు చేసినప్పటికీ వాటిని నమ్మకుండా ప్రజలు తమను ఎన్నుకున్నారని, ప్రజల ఆనందంలోనే తన ఆనందం ఉందని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు.రాష్ట్ర ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్నికల సమయంలో చాలా జరిగాయి.. ఎన్నో అబద్ధాలు చెప్పారు.. మమ్మల్నే లక్ష్యంగా చేసుకున్నారు.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రజలు ప్రజాస్వామ్య గొప్పదనాన్ని నిరూపించారు’ అని మమత చెప్పారు. కాగా ఈ ప్రజాస్వామ్య వేడుకలో అత్యంత ముఖ్యమైన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. మే 27వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నట్లు మమత స్పష్టం చేశారు.రేపు మధ్యాహ్నం 12.30కు పార్టీ శాసనసభ్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం గవర్నర్‌ను కలుస్తానన్నారు. భారీ విజయాన్ని పురస్కరించుకుని మే 30వ తేదీ వరకు రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
అసోం లో కమల వికాసం ….

kamalam
ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తగ్గట్లే అసోంలో బిజేపి ఆధిక్యం కొనసాగుతోంది. తొలిసారిగా అసోంలో బిజేపి అధికారం సొంతం చేసుకున్నట్లయింది. దేశవ్యాప్తంగా బిజేపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కేరళ, పశ్చిమ బంగాలో కూడా బిజేపి ఖాతా తెరవడం ఆ పార్టీ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాగా కేరళలోని తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఓటమిపాలయ్యాడు.. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి వీఎస్‌ శివకుమార్‌ చేతిలో శ్రీశాంత్‌ పరాజయం పాలయ్యాడు. గత ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి శివకుమార్‌ గెలుపొందారు.
కేరళలో వామ పక్ష కూటమి …

kerala
దేశంలో రాజకీయ చైతన్యానికి పేరు పొందిన కేరళలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షకూటమి (ఎల్డీఎఫ్‌) ఘనవిజయం సాధించింది. మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్‌ 91 సాధించగా అధికార యూడీఎఫ్‌ 46 స్థానాలు సాధించి పరాజయం పొందింది. అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా భాజపా విజయాన్ని సాధించింది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. యో-యో రాజకీయాలు అంటే ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పొందడం. ఇందులో భాగంగా తాజాగా ఎల్డీఎఫ్‌ గెలుపొందింది. 1977 నుంచి కేరళలో ఒకసారి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌, మరోసారి ఎల్డీఎఫ్‌ అధికారాన్ని అందుకోవడం గమనార్హం.వూమెన్‌చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. బార్‌ లైసెన్స్‌లు, సోలార్‌ కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపివేశాయి. బార్‌ లైసెన్స్‌ల కుంభకోణంలో భాగముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేఎం మణి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చాందీ అనేక ప్రజాకర్షక పథకాలు చేపట్టినా అవినీతి ఆరోపణల పర్వంలో అవి కొట్టుకుపోయాయి. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఓటమి పాలైంది.
పాండిచ్చేరి లో కాంగ్రెస్ …..

pandichheri
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌-డీఎంకే కూటమి మొత్తం 30 స్థానాల్లో 17 గెలిచి ఘనవిజయం సాధించింది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా పుదుచ్చేరిలో అధికారంలో వున్న ఏఐఎన్‌ఆర్‌సీ నేత, సీఎం రంగస్వామి పాలనకు తెరపడింది. ఏఐఎన్‌ఆర్‌సీ 8, అన్నాడీఎంకే 4, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. రంగస్వామి ఓటమితో అన్నాడీఎంకే ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 2008లో కాంగ్రెస్‌నుంచి వేరుపడిన రంగస్వామి సొంతంగా పార్టీని ఏర్పాటుచేశాడు. 2011 ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాడు. విజయం సాధించిన అనంతరం అన్నాడీఎంకేతో తెగతెంపులు చేసుకోవడం జయకు ఆగ్రహం కలిగించింది. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థులను నిలపడంతో రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్‌ఆర్‌సీకి నష్టం ఏర్పడింది.
యానంలో ఐదవ సారి మల్లాడి విజయం

malladi

కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో భాగమైన యానంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్లాడి కృష్ణారావు వరుసగా ఐదవ పర్యాయం విజయం సాధించారు. ఆయన 8,754 ఓట్ల మెజార్టీతో ఎన్నిక కావడం విశేషం.

http://2016 Assembly Election Results: West Bengal, Tamil Nadu, Assam, Kerala, Puducherry,Live: LDF wave sweeps Kerala – The Hindu,Election results 2016 LIVE: BJP scripts history in Assam; Left wins Kerala,, Live: BJP breaks Congress stranglehold over Assam,http://Assam Election Results LIVE: CM designate Sonowal thanks people …

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.