శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు
ప్రతిరోజూ ఊయల సేవ – ఏప్రియల్ 1తో ముగింపు
రాజమహేంద్రవరం గీతాప్సర థియేటర్ సమీపంలోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాలు ఏప్రియల్ 1వ తేదీవరకూ ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్ టి సి కాంప్లెక్స్ వెనుక పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో(అత్త వారిల్లు) జాతర మహోత్సవాలు మార్చి 12తో ఘనంగా ముగియడంతో మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఇంటికి తోడ్కొని వచ్చి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. 18వ తేదీ శనివారం సాయంత్రం సిరిమానోత్సవం నిర్వహిస్తారు. 22వ తేదీ రాత్రి పూజ ఘటం ఎత్తుతారు. 23వ తేదీ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జోడించి ఉత్సవాలను కొనసాగిస్తారు. ప్రతిరోజూ రాత్రి అమ్మవారికి ఊయల సేవ ఉంటుంది. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ఉత్సవ కమిటీ పక్షాన శ్రీ రెడ్డి రాజు, మాజీ కార్పొరేటర్ శ్రీ రెడ్డి మణి, కార్పొరేటర్లు శ్రీ బెజవాడ రాజ్ కుమార్ , శ్రీమతి పి మెర్సిప్రియ,కో ఆప్షన్ సభ్యురాలు శ్రీమతి మజ్జి పద్మ, ఆలయ ఈవో శ్రీ జి ఎస్ రమేష్,గొర్రెల రమణ తదిరులతో కల్సి ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రీ రెడ్డి రాజు మాట్లాడుతూ రైల్వే కాంట్రాక్టర్ గా పనిచేసే బాపనయ్య అనే వ్యక్తి 1911లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోందని చెప్పారు. 2003 పుష్కరాల సందర్బంగా ఆనాడు గుడి చైర్మన్ గా వున్న తాను ఎం ఎల్ ఏ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృషితో ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి పరిచామని చెప్పారు. దూరం నుంచి వచ్చే భక్తులకు వసతి కూడా ఏర్పాటుచేశామని తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవాల్లో భక్తజనులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు కాగా అమ్మవారి ఆలయాన్ని పలువురు ప్రముఖులు దర్శించి ఆశీస్సులు పొందారు.
https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao&*