1న  ‘పవనతనయ శతకం’ పుస్తక ఆవిష్కరణ సభ

 

pustakaavishkarana

శ్రీ దినవహి వేంకట హనుమంతరావు రచించిన ‘పవనతనయ శతకం’ పుస్తకాన్ని స్వస్తిశ్రీ హేవిలంబ నామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమీ శనివారం సాయంకాలం 6గం. లకు రాజమహేంద్రవరం వై -జంక్షన్ సమీపంలో గాంధీపురం -1 మొదటి వీధిలో గంటి రెసిడెన్సీ లో శ్రీరామ భక్తులు, భాగవత విరించి డా|| టి.వి.నారాయణ రావుగారు ఆవిష్కరిస్తారు. ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్, రాజమహేంద్రవరం
నిర్వహణలో జరిగే ఈ సభలో డాక్టర్ నారాయణ రావు “సుందర కాండ – వాల్మీకి కవితా సౌందర్యం” అనే అంశం మీద ప్రసంగిస్తారు. అమలాపురం వాస్తవ్యులు, ఆధ్యాత్మిక తత్పరులు శ్రీ కూచిమంచి రామలింగేశ్వర శర్మ , యస్.బి.ఐ రిటైర్డ్ ఆఫీసర్ శ్రీ విస్సాప్రగడ పళ్ళంరాజు, ఈ సభలో ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు. శ్రీ కొత్తపల్లి అప్పాజీ గారు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు అందరూ ఆహ్వానితులే నని నిర్వాహకులు తెలిపారు.

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=s&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i57.1852j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=rushipeetham&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.