ThyagaRaja Narayana Dasa Seva Samithi Music Festivals

16నుంచి 28వరకూ శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి

66వ సంగీత వార్షికోత్సవాలు  – విస్తృత ఏర్పాట్లు 

tyagaraja4tyagarajatyagaraja2tyagaraja3
స్వర్గీయ బుగ్గా పాపయ్య శాస్త్రి నెలకొల్పిన శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఇప్పటివరకూ 65 సంగీత వార్షికోత్సవాలు దిగ్విజయంగా పూర్తిచేసుకోగా,ఇప్పుడు 66వ సంగీత వార్షికోత్సవాలు ఏప్రియల్ 16న ప్రారంభమై,28వ తేదీ వరకూ జరుగనున్నాయి. రాజమహేంద్రవరం గోదావరి గట్టునగల సమితి స్వస్థలంలో ప్రతిరోజూ సాయంత్రం 6.30గంటలకు జరిగే ఈ ఉత్సవాలకోసం సమితి చైర్మన్ శ్రీ వాడ్రేవు వెంకట రమణారావు, సీనియర్ వైస్ చైర్మన్ శ్రీ సీఎస్ వెంకట్రావు,వైస్ చైర్మన్ శ్రీ జూపూడి వెంకట రమణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మద్దూరి శివానంద కుమార్,ఫంక్షనల్ సెక్రటరీ శ్రీ వక్కలంక రామం,ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శ్రీ విశ్వనాధం భాస్కరరామ్,జాయింట్ సెక్రటరీ డాక్టర్ చల్లా సరస్వతి,ట్రెజరర్ శ్రీ ముత్తంగి బుచ్చిరామయ్య,సభ్యులు శ్రీమతి జోస్యుల సరస్వతి,సర్వశ్రీ వి ఎస్ ఎస్ కృష్ణకుమార్, డాక్టర్ వేలూరి శ్రీరామచంద్ర, ప్రగళ్లపాటి ప్రతాప్ తదితరులతో కూడిన కార్యవర్గం ఇందుకోసం ఏర్పాట్లు చేసింది. తొలిరోజు శ్రీ పెద్దేహపు సాయిబాబా బృందంచే నాదస్వర కచేరి. అనంతరం గాన సుధా విద్వన్మణి శ్రీ మండా కృష్ణమోహన్ గాత్ర కచేరి. 17న శ్రీ సరస్వతి ప్రసాద్ బృందంచే అన్నమాచార్య సంకీర్తన. 18న శ్రీ డివి. మోహన కృష్ణ (విజయవాడ) గాత్ర కచేరి.19న శ్రీమతి షణ్ముఖ ప్రియ,శ్రీమతి హరిప్రియ( చెన్నై ప్రియ సిస్టర్స్) గాత్రం.20న చిరంజీవి ఎం శృతిరవళి (విశాఖ)గాత్రం. 21న శ్రీ డి శ్రీనివాస్(హైదరాబాద్)వీణ కచేరి. 22న శ్రీమతి వేలూరి తులసీ విశ్వనాధ్ గాత్ర కచేరి. 23న శ్రీ శేత్తలై రంగనాధ శర్మ(చెన్నై) గాత్రం. 24న శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల భాగవతార్(తిరుపతి వారిచే )హరికథ. 25న మహాకవుల (బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి – నారదుడు;బ్రహ్మశ్రీ కేశాప్రగడ సత్యనారాయణ – ఆదికవి వాల్మీకి;బ్రహ్మశ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ – మహాకవి కాళిదాసు; బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి – కవిసార్వ భౌమ శ్రీనాధుడు;బ్రహ్మశ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ – భక్తకవి పోతన;బ్రహ్మశ్రీ కోట లక్ష్మీనరసింహం – కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ) వైభవం. 26న సాయంత్రం 5.30గంటలకు సమితి సాధారణ సర్వసభ్య సమావేశం. అనంతరం బ్రహ్మశ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శాస్త్రి భాగవతార్(గుంటూరు)వారిచే హరికథ.27న శ్రీ సంజయ్ సుబ్రహ్మణ్యం(చెన్నై) గాత్రం.28న శ్రీమతి స్మితా మాధవ్ బృందంచే (హైదరాబాద్)కూచిపూడి నృత్య ప్రదర్శన. సంగీత ప్రియులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని, అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.

tyagaraja narayanadasa

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i59.1843j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=+thyagaraja+narayana+dasa+seva+samithi

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.