భారత దేశంలో వైద్య ప్రమాణాలు భేష్:డాక్టర్ ఫిల్ హిస్ట్

యుకె వైద్యునితో సాయి హాస్పిటల్ ఒప్పందం 

SAI (2)SAI (1)
అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా భారతీయ వైద్య ప్రమాణాలు ఉన్నాయని యుకె కు చెందిన కీళ్ల మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్ ఫిల్ హిస్ట్ అన్నారు. యూకేలో అతి పెద్ద టీచింగ్ హాస్పిటల్ ‘మాంచెస్టర్ రాయల్ ఇన్ ఫార్మరీ’లో 20ఏళ్లుగా ఆర్ధోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఫిల్ హిస్ట్ తో రాజమహేంద్రవరం సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎం ఓ యు కుదుర్చుకుంది. ఈ సందర్బంగా శుక్రవారం ఉదయం హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్ ఫిల్ హిస్ట్, సాయి హాస్పిటల్ ఎండి , ప్రముఖ ఆర్దోపెడిక్ సర్జన్ డాక్టర్ కురుకూరి విజయకుమార్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా డాక్టర్ ఫిల్ హిస్ట్ మాట్లాడుతూ యూకేలో అత్యుత్తమ ప్రమాణాలతో ఆపరేషన్ థియేటర్లు వుంటాయని, అయితే భారతదేశంలో కూడా అలాంటి ప్రమాణాలతో హాస్పిటల్స్, థియేటర్లు ఉన్నాయని, అందులో సాయి హాస్పిటల్ ఒకటని చెప్పారు. రాజమహేంద్రవరం లాంటి ప్రాంతంలో ఇలాంటి ఆసుపత్రి ఉండడం అభినందనీయమన్నారు. నిజానికి భారతేదేశం ఓ క్లిష్టమైన కీళ్ల మార్పిడి చికిత్సలు చేస్తున్నారని, అందుకే ఇక్కడకు వచ్చి చాలా విషయాలు నేర్చుకుంటున్నానని డాక్టర్ ఫిల్ హిస్ట్ అన్నారు. యూకేలో కీళ్ల మార్పిడి చికిత్సలు ప్రారంభ దశలో జరుగుతాయని అదే భారత్ లో అయితే కీళ్ల వ్యాధులు ముదిరిపోయాక చేయించుకుంటున్నారని, అయినా ఎంతో సమర్ధవంతంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
డాక్టర్ కురుకూరి విజయకుమార్ మాట్లాడుతూ డాక్టర్ ఫిల్ హిస్ట్ తో ఒప్పందం కుదుర్చుకోవడం వలన మోకీలు ఆపరేషన్ లో మరిన్ని మెళుకువలు, కొత్త విధానాలు నేర్చుకోడానికి వీలుకలుగుతుందని అన్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాల ఆర్ధోపెడిక్ వైద్యులతో ఒకరోజు లైవ్ వర్క్ షాపు కూడా ఏర్పాటుచేశామన్నారు. కీళ్ల మార్పిడి చికిత్స ఖర్చు చాలా వరకూ తగ్గిందని, భవిష్యత్తులో ఇంకా తగ్గే అవకాశం ఉందని ఆయన సూచించారు.
ఆపరేషన్లకు రుణ సౌకర్యం కోసం 
ఆరోగ్య సంస్థతో ఒప్పందం 
అలాగే రెండు లక్షల రూపాయలవరకూ ఖర్చయ్యే ఆరేషన్లకు రుణ సౌకర్యం కల్పించడానికి ఆరోగ్య సంస్థతో తమ హాస్పిటల్ ఒప్పందం కుదుర్చుకోడానికి రంగం సిద్ధం అయిందని డాక్టర్ విజయకుమార్ చెప్పారు. ముంబాయికి చెందిన ఆరోగ్య సంస్థతో ఇప్పటికే విశాఖ తదితర ప్రాంతాల్లోని హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయని, రాజమండ్రిలో సాయి హాస్పిటల్ ఆదిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. రెండు లక్షల రూపాయల ఖర్చయ్యే ఆపరేషన్ కి 25శాతం పేషేంట్ భరిస్తే,మిగిలిన మొత్తాన్ని రుణంగా అందిస్తారని, నెలవారీ గా ఈమొత్తాన్ని తిరిగి చెల్లించాలని, ఏడాదిలోగా ఋణం చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదని, రెండేళ్ళలో చెల్లిస్తే కొద్దిమొత్తం వడ్డీ ఉంటుందని ఆయన సూచించారు.
ఆపరేషనలు ప్రత్యక్ష ప్రసారం … 
కాగా సాయి హాస్పిటల్ లో రెండు క్లిష్టమైన మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ల ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా హోటల్ లా హాస్పిన్ లోని ఉభయ గోదావరి జిల్లాల ఆర్ధోపెడిక్ వైద్యుల సదస్సులో స్క్రీన్లపై ప్రదర్శించారు. అలాగే ఆర్ధోపెడిక్ సర్జన్ల సందేహాలను లైవ్ లో డాక్టర్ ఫిల్ హిస్ట్ నివృత్తి చేశారు. ఈసందర్బంగా డాక్టర్ ఫిల్ హిస్ట్ ను డాక్టర్ విజయకుమార్ సత్కరించారు. ఆసుపత్రి సి ఇఓ శ్రీ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

sai Hospitals (3)sai Hospitals (1)sai Hospitals (2)

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.