Two Days ISRO programmes in Rajahmundry Arts College

isro visit0isro visitisro jayaho

ఆనాటి ‘ఆల్ ది బెస్ట్ ఇస్రో … జయహో భారత్ ‘ పర్యవసానమే…. 

రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు ఇస్రో కార్యక్రమాలు
జర్నలిస్ట్ కుడుపూడి సారధి, ట్రిప్స్ – ఆదిత్య యాజమాన్యాలకు అభినందనలు 

????????????????????????????????????

????????????????????????????????????

????????????????????????????????????

ప్రపంచ అంతరిక్ష పరిశోధన వారోత్సవాలలో భాగంగా రాజమహేంద్రవరంలో తొలిసారిగా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో రెండురోజుల పాటు ఇస్రో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ ఆర్ట్సు కళాశాల మైదానంలో 5,6తేదీల్లో జరిగిన ఈ ప్రదర్శనకుపెద్ద సంఖ్యలో విద్యార్ధులు తరలివచ్చారు. తొలిరోజు ఉదయం ఎపి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహణ్యం ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే ఇస్రో బ్రోచర్‌ను శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం, సిటీ ఎం ఎల్ ఏ డాక్టర్ ఆకుల సత్యనారాయణ విడుదల చేశారు. రాకెట్లకు సంబంధించి నమునా స్టాల్స్‌ను శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. నగర మేయర్‌ శ్రీమతి పంతం రజనీ శేషసాయి,షార్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ ఎం నాగ సత్యనారాయణ, కమిటీ చైర్మన్‌ ఇస్రో శాస్త్రజ్ఞులు శ్రీ జి.సత్యనారాయణ, ప్రభుత్వ ఆర్ట్సు కళాశాల ప్రిన్సిపాల్‌ డేవిడ్‌కుమార్‌,తదితరులు పాల్గొన్నారు.

????????????????????????????????????

????????????????????????????????????

????????????????????????????????????

ఆరోజు సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. రెండవ రోజు ముగింపు వేడుకకు సబ్ కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాజమహేంద్రి మహిళా కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ టికే విశ్వేశ్వరరెడ్డి,తిరుమల విద్యాసంస్థల అధిపతి శ్రీ నున్న తిరుమలరావు,తదితరులు హాజరయ్యారు. క్విజ్,తదితర పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించారు.

saradhi isro (4)saradhi isro (3)saradhi isro (2)saradhi isro (1) isro program (7)

????????????????????????????????????

isro program (1)

????????????????????????????????????

isro program (6)isro program (4)isro program (5)

ఏ కార్యక్రమం జరిగినా అందుకు ఓ ప్రధాన కారణం ఉంటుంది. సందడిగా సాగిన ఈ రెండు రోజుల అంతరిక్ష అవగాహన కార్యక్రమాలు రాజమహేంద్రవరం లో జరగడానికి ప్రధాన కారణం సీనియర్ జర్నలిస్ట్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కుడుపూడి పార్ధసారధి.
ఎందుకంటే, ఈయన నిర్వహించే సారధి స్వచ్చంద సేవా సంస్థ, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్,ఆదిత్య విద్యా సంస్థ లతో కల్సి ఓ వినూత్న కార్యక్రమాన్ని పుష్కర ఘాట్ లో గత జనవరి 28న నిర్వహించారు. ఎందుకంటే ఇస్రో ఆధ్వర్యాన శ్రీహరి కోట నుంచి 104దేశీయ, అంతర్జాతీయ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన నేపథ్యంలో ‘ఆల్ ది బెస్ట్ ఇస్రో … జయహో భారత్ ‘ అని చెబుతూ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు,ప్రముఖులు హాజరయ్యారు. ట్రిప్స్, రాజమహేంద్రి,ఆదిత్య తదితర విద్యాసంస్థల విద్యార్థులు ‘పీఎస్ ఎల్ వి సి 37’ఆకృతిలో కూర్చుని ఇస్రో శాస్త్ర వేత్తలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్బంగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ అక్కడ ఏర్పాటుచేసిన ప్లెక్సీ పై ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్,సిటీ ఎం ఎల్ ఏ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి,   వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు శ్రీ ఇన్నమూరి రాంబాబు   కోసూరి చండీప్రియ, బొంతా శ్రీహరి, బెజవాడ రాజ్‌కుమార్‌, పెనుగొండ విజయభారతి, రెడ్డి పార్వతి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, పిల్లి నిర్మల, ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎం.డి శ్రీమతి .బాలా త్రిపుర సుందరి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌  శ్రీఎస్‌.పి.గంగిరెడ్డి, రాజమహేంద్రి కళాశాల కరస్పాండెంట్‌ శ్రీ టి.కె.విశ్వేశ్వరరెడ్డి,   రాజమండ్రి రైజింగ్‌ అడ్మిన్‌ మాటూరి సిద్ధార్థ, కార్టూనిస్ట్‌ శేఖర్‌, విజ్జల అప్పయ్యశాస్త్రి, అక్షరశ్రీ స్కూల్‌ ఎం.డి. శ్రీమతి నాగరత్నం,  తదితరులతో పాటు పలువురు ప్రముఖులు, విద్యార్థులు సంతకాలు చేసారు. ఈ ఫ్లెక్సీని స్వయంగా ఇస్రో అధికారులకు అందజేయాలని నిర్ణయించి, వర్తమానం పంపడం, వారు అంగీకరించడంతో ఫిబ్రవరి 27న శ్రీ కుడుపూడి పార్ధసారధి,ట్రిప్స్ అధినేత్రి శ్రీమతి బాలాత్రిపుర సుందరి, శ్రీమతి వి సుచిత్ర భాస్కరరామ్, ఆదిత్య మహిళా కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ జివిఎస్ నాగేశ్వరరావు,ట్రిప్స్ ఉపాధ్యాయులు రాజర్షి కుమార్,మృణాళిని,విద్యార్థులు వి ఆనందిత,వై నేహా,ఎస్ దీపం,యు సంపత్,కృష్ణ వంశీ,ఏ హుస్సేన్ తదితరులు శ్రీహరి కోట వెళ్లారు. షార్ సెంటర్ లో ఇస్రో అధిపతి శ్రీ ఉన్నికృష్ణన్ కి కలుసుకుని రాజమహేంద్రవరం పౌరుల పక్షాన ఫ్లెక్సీ అందించి, శాలువాతో జ్ఞాపికతో సత్కరించారు. గోదావరి తీరంలో ఇస్రోను అభినందిస్తూ నిర్వహించిన జయహో కార్యక్రమ ఆల్బమ్ ను శ్రీ ఉన్నక్రిష్ణన్ కి అందించారు. అక్కడ అన్ని విభాగాలను ఈబృందానికి షార్ అధికారులు చూపించారు. రాజమహేంద్రవరాన్ని సందర్శించాలని కోరగా, తప్పకుండా సందర్శిస్తామని ఇస్రో అధికారులు చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు రెండురోజుల పాటు కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించారు. ఓ మంచి కార్యక్రమం గోదావరి తీరాన అందునా రాజమహేంద్రవరంలో జరగడానికి కారణమైన జర్నలిస్ట్ కుడుపూడి సారధికి,  ఇందుకు సహకరించిన ట్రిప్స్ – ఆదిత్య యాజమాన్యాలకు అభినందనలు.

https://www.google.co.in/search?q=Isro&oq=Isro&aqs=chrome..69i57j69i61j0l4.4787j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/search?q=sriharikota&oq=srihari&aqs=chrome.0.0j69i57j0l4.3395j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/search?q=rajamahendravaram+autonamus+college&oq=rajamahendravaram+autonamus+college&aqs=chrome..69i57.21447j0j7&sourceid=chrome&ie=UTF-8

http://sarikothasamacharam.com/%E0%B0%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%86/

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.