A. P. Brahmin Co.operative Credit Society Ltd

ఆర్ధిక పురోగతి కోసం బ్రాహ్మణ  సొసైటీ సభ్యులుగా చేరండి  
   రాజమహేంద్రవర  బ్రాహ్మణ సదస్సు పిలుపు 
brahmana.jpg2brahmana
‘సమాజంలో ఒకప్పుడు అగ్రభాగాన నిలిచి, ఎన్నో త్యాగాలు చేసి, విశ్వ  మానవ శ్రేయస్సు కాంక్షించే, బ్రాహ్మణ జాతి  ఇప్పుడు  అట్టడుగుకు చేరింది. అందుకే బ్రాహ్మణ జాతి పురోభివృద్ధికి , ముఖ్యంగా ఆర్ధికాభివృద్హికి ప్రతి ఒక్కరు క్రెడిట్ సొసైటీ లో సభ్యులుగా చేరాలి’ అని  రాజమండ్రి లలితానగర్ భార్గవ కమ్యూనిటీ హాల్ లో జరిగిన బ్రాహ్మణ సదస్సు పిలుపునిచ్చింది 38 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కేబుల్ రమణ అధ్యక్షతన ఏర్పాటైన సదస్సులో  ముఖ్య అతిధిగా బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ రాణి శ్రీనివాస్ విచ్చేశారు . గౌరవ అతిధులుగా ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులు శ్రీ  వైఎస్ నరసింహారావు, దువ్వూరి సురేష్ , రాష్ట్ర అర్చక సమాఖ్య కార్యదర్శి శ్రీ  కె.వి ఎస్.ఆర్.ఎన్ ఆచార్యులు, అక్షర కోటి  గాయిత్రి పీఠం వ్యవస్థాపకులు శ్రీ  సవితాల చక్రభాస్కర రావు, ఆర్వీ సూర్యారావు,ముత్య సత్తిబాబు, చల్లా ప్రవీణ్, సూర్య సాయం పత్రిక సంపాదకులు వి ఎస్ ఎస్ కృష్ణ కుమార్ ,  తదితరులు వేదికపై ఆసీనులయ్యారు.  సదస్సులో వక్తలు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఆర్ధికంగా రాజకీయం బలోపేతం కావాలన్నారు.  జిల్లా కోఆర్డినేటర్ శ్రీ  రాణి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రెడిట్ సొసైటీ లో ఐదు వందలు షేర్ ధనం కింద 100 రూపాయలు మొత్తం ఆరువందల చెల్లించాలన్నారు. వచ్చే ఏప్రియల్ నుంచి క్రెడిట్ సొసైటీ లో సభ్యులు కానివారికి పధకాలు వర్తించవని చెప్పారు. క్రెడిట్ సొసైటీ వల్ల లాభాలను ఆయన వివరిస్తూ, ‘ఆధార్ కార్డు ఉన్నవాళ్లే ఏ క్లాస్ సభ్యత్వం ఉంటుంది.  రూ 500 చొప్పున  ఎన్ని షేర్లు తీసుకున్నా, ఓటు హక్కు మాత్రం  ఒకటే  వుంటుంది. మూడేళ్ళ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఆతర్వాత సభ్యత్వం విత్ డ్రా అవ్వవచ్చు. బి క్లాస్ సభ్యత్వంలో ఎంతైనా కట్టవచ్చు. ఓటు ఉండదు’ అని చెప్పారు. సదస్సు ఏర్పాటు చేసిన 38 వ డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ నండూరి రమణ మాట్లాడుతూ బ్రాహ్మణ జాతికి సేవకు రాజమండ్రిలో  ఇప్పుడు వున్న సీతంపేటలో సహాయ కేంద్రానికి తోడు మరో మూడు ఏర్పాటు చేస్తామన్నారు. అర్ధరాత్రి పిలిచినా సరే,  ఏ సేవకైనా సిద్ధమని ఆయన పేర్కొంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ  ఐవైఆర్ కృష్ణారావు  బాటలో అంతా నడుద్దామని , వచ్చేనెల చివరి నాటికి రెండువేల మంది సభ్యులతో కోపరేటివ్ బ్రాంచ్ ప్రారంభిద్దామని అన్నారు.  ఈసందర్బంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు గతంలో కృషిచేసిన స్వర్గీయ చల్లా వెంకట్రామయ్యను స్మరిస్తూ, అలాగే శ్రీమతి చల్లా బలికామేశ్వరి కార్పొరేటర్ గా అందించిన సేవలు అద్వితీయమని సభలో పలువురు పేర్కొంటూ, వారి  కుమారుడు  శ్రీ  చల్లా ప్రవీణ్ కి చిరు  సత్కారం చేశారు. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ కాలెండర్ ని కూడా సభలో ఆవిష్కరించారు. 
brahmin50
https://www.google.co.in/search?q=raghaveeyam&oq=rag&aqs=chrome.1.69i60j69i59j69i60l3j69i57.2219j0j7&sourceid=chrome&ie=UTF-8

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.