Buddiga Srinivas elected CREDAI Ap vice president

క్రెడాయ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్ కి సత్కారం

buddiga
‘కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న జిఎస్‌టి, పిఎఫ్‌, ఇఎస్‌ఐలను క్రెడాయి స్వాగతిస్తోంది. వాటిని ఏ ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టారో అది నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రభుత్వ ఉద్దేశ్యాలు రియల్‌ ఎస్టేట్‌ రంగ పురోగమనాన్ని అడ్డుకునే విధంగా మారకూడదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మార్పు చేసిన భవన నిర్మాణ నిబంధనలను కూడా స్వాగతిస్తున్నాం. అయితే రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంపు డ్యూటీని తగ్గించి స్థలాల విలువ మార్కెట్‌ రేటుకు దగ్గరగా పెంచాలని కోరుతున్నాం. అలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పిఎఫ్‌, ఇఎస్‌ఐ వర్తింపజేసిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లేబర్‌ సెస్‌ రద్దు చేయాలి. క్రెడాయి సంస్థ ప్రజల నుంచి మంచి నమ్మకాన్ని సొంతం చేసుకుని, వినియోగదారులకు అనువుగా గృహాలను నిర్మిస్తూ ఇరువర్గాలకు లబ్ధి చేకూరేలా పనిచేస్తోంది’ అని ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బుడ్డిగ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. క్రెడాయి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు ఆయనను హోటల్‌ లా హాస్పిన్‌లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుడ్డిగ మాట్లాడుతూ క్రెడాయి రాజమహేంద్రవరం చాప్టర్‌కు కొత్త పాలకవర్గం నియమించామని పేర్కొన్నారు. చైర్మన్‌గా నందెపు శ్రీనివాస్‌, అధ్యక్షులుగా సూరవరపు శ్రీనివాసకుమార్‌, ఉపాధ్యక్షులుగా మన్యం ఫణికుమార్‌, కర్రి సీతారాంరెడ్డి, కార్యదర్శిగా వెలుమూరి భీమశంకరరావు, కోశాధికారిగా అనసూరి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా చల్లా సురేష్‌కుమార్‌, యర్రా గురుదేవ్‌, గౌరవ సలహాదారులుగా మట్టపల్లి రంగప్రసాద్‌, మన్నె సుబ్బారావు, మెరపల శ్యామలరావు, సాంకేతిక సలహాదారునిగా టి.వి.ఎల్‌.నరసింహారావు, కార్యవర్గ సభ్యులుగా తొక్కుల రమేష్‌, ఎస్‌.మల్లికార్జునరావు, జి.వి.వి.సుబ్రహ్మణ్యం, వాసం త్రిమూర్తులు, పూడి శ్రీనివాస్‌, రెడ్డి రామకృష్ణ నియమితులయ్యారని చెబుతూ, నూతన కార్యవర్గం సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని మూడు విభాగాలుగా విభజించారని, ఈ స్కీమ్‌లో అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలకు వినియోగించే స్థలాలపై స్థూల ఆదాయ పన్ను రద్దు చేయాలని కేంద్రాన్ని తాము కోరుతున్నామన్నారు. కోరారు. ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రీ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం పాల్గొని కొత్త పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సర్వశ్రీ సూరవరపు రామారావు,తొక్కుల రామాంజనేయులు, సునీల్ కల్రా, తదితరులు పాల్గొన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=credai+ap+state&*

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i59.2548j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.