E.V.M’s tamper-proof as ever, asserts E.C.

ఈవీఎం లలో ఓట్ల తారుమారు సత్యదూరం
రాజకీయ పక్షాల విమర్శలపై కే౦ద్ర ఎన్నికల స౦ఘ౦ ప్రకటన‌

evms
 ఉత్తర ప్రదేశ్, ప౦జాబ్, ఉత్తరాఖ౦డ్, గోవా, మణిపుర్,   రాష్ట్రాల శాసన సభకు జరిగిన సాధారణ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగ౦పై, వాటి పనితీరుపై అనేక‌ రాజకీయపక్షాలు, కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కే౦ద్ర ఎన్నికల స౦ఘ౦ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి౦ది. కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసింది. ఎందుకంటే యుపి మాజీ సీఎం మాయావతి,  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  వంటివాళ్ళు ఈవీఎం లపై అనుమానం వ్యక్తంచేసినట్లు వార్తలొచ్చాయి. అందుకే ఎన్నికల సంఘం పూర్తి వివరణ ఇచ్చింది. ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓట్లు తారుమారు (టాంపరింగ్‌) చేసినట్లు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ‌ ప్రధాన కార్యదర్శి మార్చి 11 వ తేదీన‌ నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్య౦లో కే౦ద్ర ఎన్నికల స౦ఘ౦ ఆ ఆరోపణలను తోసి పుచ్చుతూ , ఆ ఆరోపణలకు స౦బ౦ధి౦చిన వివరణాత్మక ప్రతిస్పందన www.eci.nic.in లో ఉ౦చినట్లు తెలిపి౦ది
· 2000 స౦వత్సర౦ ను౦చి ఇప్పటి వరకు107 సాధారణ ఎన్నికలలో రాష్ట్ర శాసన సభలకు, 2004, 2009,2014 లోక సభ ఎన్నికలలో ఓటింగ్ కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. అనేక ప్రయత్నాల‌ తర్వాత అంచెలంచెలుగా ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ యంత్రాలను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రతి ఎన్నికలోను పూర్తిస్థాయిలో యంత్రాలు వినియోగిస్తున్నారు. మనది అతిపెద్ద దేశమైనందున ఓటింగ్ యంత్రాలు ప్రవేశపెట్టాక ఓటింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగవంతమైంది. ఆ మేరకు వ్యయప్రయాసలు తగ్గాయి. 1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్‌లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి.
ఓట్ల తారుమారు (టాంపరింగ్) పై 2001 ను౦చి దేశ౦లోని వివిధ హై కోర్టులు ఈవీఎం లలో ఉపయో గిస్తున్న సా౦కేతికపై ఎటువ౦టి స౦దేహ౦ లేదని తీర్పునిచ్చాయి.
ఈవీఎం ఎలా పనిచేస్తుంది?
· బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈవీఎంలో రెండు భాగాలుంటాయి. ఒకటి కంట్రోలింగ్‌ (నియంత్రణ) యూనిట్, రెండోది బ్యాలెటింగ్‌ (ఓట్ల ప్రక్రియ) యూనిట్‌. ఎన్నికల కేంద్రంలోని ప్రిసైడింగ్‌ అధికారి ఈ కంట్రోలింగ్‌ యూనిట్‌కు ఇంచార్జీగా వ్యవహరిస్తారు. ఓటర్‌ తన ఓటు వినియోగించుకునేందుకు సిద్ధమవగానే.. బ్యాలెటింగ్‌ యూనిట్‌ను ఆయన యాక్టివేట్‌ చేస్తారు. తర్వాత ఓటర్‌ తనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న మీటను నొక్కి ఓటేస్తాడు. ఓటు పడగానే ప్రిసైడింగ్‌ అధికారి.. పోలింగ్‌ బూత్‌లో ఉన్న వివిధ పార్టీల ఏజెంట్లకు ఓటు నమోదైనట్లు ధ్రువీకరిస్తారు. కౌంటింగ్‌ సమయంలో నమోదైన ఓట్ల సంఖ్యలో తేడా రాకుండా ఏజెంట్ల లెక్కలతో ప్రిసైండింగ్‌ అధికారి లెక్కలు సరిపోయేందుకు ఇలా చేస్తారు. ఓటింగ్‌ సమయంలో ఈవీఎం బాహ్య నెట్‌వర్క్‌తో అనుసంధానం ఉండదు.
కౌంటింగ్‌ సమయలో ఈవీఎంపై ఉన్న ‘రిజల్ట్‌’ మీటను నొక్కటం ద్వారా ఎవరికెన్ని ఓట్లో తెలుసుకోవచ్చు. ఓటింగ్‌ సమయలో ఈ బటన్‌ సీల్‌ చేస్తారు. ప్రతి ఈవీఎంకు ఓ ఐడీ నెంబరుంటుంది. అది ఎన్నికల సంఘం డేటాబేస్‌లో రికార్డవుతుంది. పోలింగ్‌ బూత్‌కు తీసుకెళ్తున్నపుడు, ఓటింగ్‌ పూర్తైన తర్వాత ఈ ఐడీని మరోసారి చెక్‌ చేసుకుంటారు.
ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ–ఓటు ధ్రువీకరణ పత్రం)
· 2013 అక్టోబర్ నెలలో సుప్రీంకోర్టు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ–ఓటు ధ్రువీకరణ పత్రం)ను 2019లోపు దశల వారీగా ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ఈవీఎంకు అనుసంధానించిన ప్రింటరు నుంచి తను ఓటేసిన గుర్తు, సీరియల్ నంబర్తో కూడిన ప్రింట్ డ్రాప్ బాక్స్లోకి వస్తుంది. అయితే డ్రాప్బాక్స్లో పడే ముందు కొద్ది క్షణాలపాటు ఓటరు దీన్ని చూసేందుకు (తను అనుకున్న పార్టీకే ఓటు పడిందా లేదా అని తెలుసుకునేందుకు) వీలుంటుంది. ఒకవేళ ఈవీఎం ఓట్లలో ఏమైనా తేడా ఉందనిపిస్తే.. డ్రాప్బాక్సును తెరిచి కౌంటింగ్ చేసుకోవచ్చు. దీన్ని 2013లో నాగాలాండ్ ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు.
భారత ఎన్నికల సంఘం ఓట్ల తారుమారు (టాంపరింగ్) పై వస్తున్న ఆరోపణలను ఖండించింది. తమ దగ్గరున్న ఈవీఎంలు అత్యున్నత ప్రమాణాలతో కూడినవని టాంపరింగ్ కు వీల్లేనివని ఈ స౦దర్భ౦గా స్పష్టం చేసింది.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.