Equitable development in rajamahendravaram municipal corporation

రెండేళ్ల పాలనపై మేయర్ సంతృప్తి

meyor2meyor
నగర పాలక మండలి రెండేళ్ళ పాలనపై మేయర్‌ శ్రీమతి పంతం రజనీ శేషసాయి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అన్ని డివిజన్లను సమాన ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. నగర పాలక సంస్ధ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం ఉదయం డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కోరిమెల్లి విజయశేఖర్‌, విప్‌ గొందేశి మాధవీలత, కార్పొరేటర్లు బెజవాడ రాజ్‌కుమార్‌, తంగెళ్ళ బాబి, గరగ పార్వతి, సింహ నాగమణి, రెడ్డి పార్వతి, మెర్సీ ప్రియ, పెనుగొండ విజయభారతి తదితరులతో కల్సి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఏడాది గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించామని, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు 12 రోజుల పాటు నగరంలోనే ఉండి పుష్కరాలు విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించారని గుర్తుచేశారు. పుష్కరాల నిర్వహణకు చేపట్టవలసిన పనుల నివేదికలను సమర్పించగానే నిధులను విడుదల చేశారని తెలిపారు.
గడిచిన రెండేళ్ళ పాలనలో ఆదాయ వనరులను పెంచడం, పన్నుల వసూళ్ళను మెరుగు పర్చడం, పార్కులు, ముఖ్య కూడళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. 50 డివిజన్లలో చేసిన, చేయాల్సిన పనులకు రెండేళ్ళ కాలంలో రూ. 135 కోట్లను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రణాళికబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, చంద్రబాబు పాలనా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని రానున్న మూడేళ్ళలో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా నగరంలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు రూ. 15 వేలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్‌ పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, స్మార్ట్‌ సిటీగా నగరం ఎంపికయ్యేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. నగర పాలక సంస్ధలో అధికారులెవరైనా పాలకుల మాట వినకపోతే వారి సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తేల్చుకుంటానని, ఈ విషయంలో రాజీ ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. కార్పొరేటర్ల నుంచి ఫిర్యాదులు రాకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు.

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=rajamahendravaram%20municipal%20corporation

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=municipal%20administration%20ap

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.