ganesh chaturthi in rajahmundry nalam Bhimaraju street

నాళం భీమరాజు వీధిలో  వినాయక చవితి ఉత్సవాలు

nalam bheemaraju
రాజమహేంద్రవరం నగరంలోని నాళం భీమరాజు వీధిలో 166 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ నెల 5 వ తేదీ నుంచి గణపతి నవరాత్ర మహోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురాతనమైన ఈ ఆలయాన్ని 1858 వ సంవత్సరంలో గోదావరి డెల్టా రూపశిల్పి సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ దర్శించుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ నిర్మాణ మొక్కు తీర్చుకోవడానికి కాటన్‌ ఈ దేవాలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని లండన్‌ నుంచి గంటను రప్పించి మరీ స్వామికి కానుకగా సమర్పించారు.
ఈ ఆలయంలో ఇప్పటికీ ఈ గంట దేవాలయంలో భక్తులకు అందుబాటులో ఉంది. ఈ గంటను పురావస్తు శాఖ గుర్తించింది. ఇక్కడ వినాయకునికి ఆరు కొబ్బరి కాయలు కొట్టి, ఏదైనా కోరిక ఉంటే మొక్కుకుంటారు. కోరిక తీరిన తర్వాత 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇక జిల్లాలో ధ్వజస్తంభం గల రెండవ వినాయక ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అత్యంత వినాయకుడిని దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని అంటారు. ఇంత చరిత్ర, మహిమ కలిగిన ఈ ఆలయంలో ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ శెట్టి జగదీష్‌, డైరక్టర్లు కొత్త బాలమురళీకృష్ణ, గునిశెట్టి విజయ్‌కిరణ్‌, కూరెళ్ళ పవన్‌, కోరుకొండ శ్రీరామ్‌ ప్రసాద్‌, నమ్మి అరుణ, దొంతంశెట్టి వీర్రాజు, కపిలవాయి వెంకటేశ్వర శర్మలతో పాటు గౌరవ సలహాదారులు మాటూరి రంగారావు, యిన్నమూరి రాంబాబు (కార్పొరేటర్లు), కుర్మదాసు ప్రభాకర్‌, కోడూరి శాంతారామ్‌, నందెపు శ్రీనివాస్‌, డి.వి.కె.రమేష్‌, కూర్మాల యోగ నర్సింహప్రసాద్‌, బత్తుల శ్యామలరావులతో పాటు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తమ్మన గోపాలకృష్ణ, పచ్చిగోళ్ళ సురేష్‌, గ్రంధి బ్రహ్మానందం(రాజా), మోటమర్రి మురళి, కొత్త రాజేష్‌, చెక్క సూర్యనారాయణ, కొర్లేపర భాస్కర్‌, మద్ది శివప్రసాద్‌, పర్చూరి సత్యనారాయణ, జి.రామకృష్ణ (ఆర్‌కె), పాబోలు మాధవ, పచ్చిగోళ్ళ సూర్యనారాయణ తదితరులు ఉత్సవాల నిర్వహణ లో పాలుపంచుకుంటున్నారు. 5 వ తేదీ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఎ మ్మెల్యేలు శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, మేయర్‌ శ్రీమతి పంతం రజనీ శేషసాయి పాల్గొంటారు. శెట్టి జగదీష్‌, మాటూరి సిద్ధార్ద స్పాన్సర్‌ చేసిన ఈ విగ్రహాన్ని కార్పొరేటర్‌ శ్రీ మాటూరి రంగారావు ప్రారంభిస్తారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=ganesh+chaturthi+in+rajahmundry

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.