Ganesh chaturthi in Rajahmundry Pushkar ghat

పుష్కర్ ఘాట్ లో వినాయక చవితి ఉత్సవాలు

vidya ganapati

ప్రజలు శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలన్న సంకల్పంతో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు రాజమహేంద్రి గణేష్‌ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి, అన్ని పార్టీలను మమేకం చేసి పుష్కర ఘాట్‌ వద్ద గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించేవారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా శ్రీ విద్యా గణపతిని ప్రతిష్టించి వేడుకలు నిర్వహిస్తున్నారు. గత ఆరేళ్ళుగా ఉత్సవాలను వినూత్నంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండు పర్యాయాలు భారీ లడ్డూను ఏర్పాటు చేయడం వల్ల గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్ధానం సంపాదించా మని ఉత్సవ సమితి పక్షాన శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి చెప్పారు. సౌభాగ్య గణపతి, చింత గణపతిలను ప్రతిష్టించి, గాజులను, నాణెలను భక్తులకు పంపిణీ చేశామ ని ఆమె గుర్తుచేశారు. ఈ ఏడాది సమస్త కోరికలకు మూలమై పంచదశ మంత్రానికి గణేష్‌ తత్వానికి మూలమైన శ్రీ విద్యా గణపతిని ఈ ఏడాది ప్రతిష్టిస్తున్నామన్నారు.
లక్షా 11 వేల 111 పెన్నులతో విగ్రహం …
లక్షా 11 వేల 111 పెన్నులతో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. చారిత్రక రాజమహేంద్రవరంలో కలానికి, కవులకు ఎంతో సంబంధం ఉన్నందున పెన్నులతో శ్రీ విద్యా గణపతిని నెలకొల్పుతున్న ట్లు శ్రీమతి విజయలక్ష్మి చెప్పారు. ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గణేష్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ప్రజలంతా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్న ఉద్ధేశ్యంతో దివంగత జక్కంపూడి రామ్మోహనరావుతో కమిటీని ఏర్పాటు చేశారన్నారు. పుష్కర ఘాట్‌లో గణేష్‌ ఉత్సవాలు ముగిసిన తర్వాత దేవీచౌక్‌లో దేవీ నవరాత్రులు అనంతరం అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం జరుగుతా యని గుర్తుచేశారు. జిల్లా వర్తక ఫెడరేషన్‌ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరా జనరల్‌ మార్కెట్‌లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరా స్వామి కల్యాణాన్ని వినాయక ఉత్సవంలో జరిపిస్తామని తెలిపారు.
బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాలను అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ రాజమహేంద్రి గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వహించే వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి వారి అనుగ్రహానికి పాత్రుల కావాలన్నారు. స్ధానిక కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు మాట్లాడుతూ వినాయక ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతమంతా శోభాయమానం అవుతుందని, భక్తుల రాకతో ఈ ప్రాంతం యాత్రా స్ధలంగా కనిపిస్తుందన్నారు. అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మంతెన కేశవరాజు, మేడపాటి షర్మిళారెడ్డి, గుత్తుల మురళీధరరావు, బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, సుంకర చిన్ని, యిన్నమూరి దీపు, దంగేటి వీరబాబు, మరుకుర్తి చంద్రశేఖరయాదవ్‌, జక్కంపూడి గణేష్‌, ముద్దాల అను, కోడికోట సత్తిబాబు పాల్గొన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=ganesh+chaturthi+in+rajahmundry

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.