great person potula veerabhadrarao

ఆదర్శప్రాయుడు పోతుల వీరభద్రరావు
18వ వర్ధంతి సభలో పలువురు నివాళి

potula
మాజీ మున్సిపల్ చైర్మన్,మాజీ ఎం ఎల్ ఏ , అజాత శతృవు సాహిత్యాభిలాషి అయిన శ్రీ పోతుల వీరభద్రరావు 18వ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి శ్రీ వీరేశలింగం పురమందిరం(టౌన్ హాలు)లో శనివారం సాయంత్రం శ్రీ వీరభద్రరావు ట్రస్ట్ చైర్మన్ శ్రీ వైఎస్ నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు , కార్పొరేటర్ శ్రీమతి కోసూరి చండీప్రియ జ్యోతి ప్రజ్వలన చేసారు. టౌన్ హాలు ట్రస్టీ శ్రీ గరిమెళ్ళ చిట్టిబాబు సభా ప్రారంభం చేసారు. ఈ సందర్బంగా ‘పంతులు గారు – నాయుడు గారు’ అనే అంశంపై ఆదికవి నన్నయ్య విశ్వ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ తలారి వాసు స్మారకోపన్యాసం చేసారు. ఈ సందర్బంగా సర్వశ్రీ సిబివి ఆర్ కె శర్మ (సాహిత్య రంగం), ఇమంది శ్రీరాములు(సేవా రంగం),డాక్టర్ సివిఎస్ శాస్త్రి (క్రీడా రంగం) లకు ట్రస్ట్ పక్షాన సత్కారం చేసారు. శ్రీ వీరభద్రరావు ట్రస్ట్ సభ్యులు శ్రీ మార్గాని నాగేశ్వరరావు,ఆంద్రకేసరి డిగ్రీ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ షేక్ అసదుల్లా అహ్మద్ విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. ట్రస్ట్ కార్యదర్శి శ్రీ ఆకుల వీర్రాజు స్వాగతం పలికారు. సర్వ శ్రీ ఫణి నాగేశ్వరరావు, డాక్టర్ అరిపిరాల నారాయణ రావు, పెరుమాళ్ళ రఘునాధ్, సుంకర నాగిన్,జగన్నాధం వెంకట రెడ్డి, జామిశెట్టి గాంధీ, తొక్కుల రామాంజనేయులు, జాగారపు సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

potula2

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=sarikotha+samacharam&*

https://www.google.co.in/search?q=potula+veerabhadrarao&oq=po&aqs=chrome.5.69i60j69i61l2j69i60j69i57j69i59.3707j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=kandukuri+veeresalingam&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.