Gunni Krishna, who took over as the chairman of GUDA

చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయను
గుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గన్ని కృష్ణ

gudaa2gudaa
‘నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాత, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు కు పేరు తెచ్చేలా పనిచేస్తా. ఎన్‌టిఆర్‌ వేసిన విత్తనాన్ని చంద్రబాబు వటవృక్షంలా పెరిగేలా పార్టీని అభివృద్ధి చేశారని, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేసి ఆయనకు, పార్టీకి మంచి పేరు తెస్తా, బాబు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేసి గుడా పరిధిలోని నగరాలు, పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తా”అని గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ తొలి ఛైర్మన్‌ శ్రీ గన్ని కృష్ణ వెల్లడించారు. గుడా తొలి చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీ గన్నికృష్ణ జూన్ 3మధ్యాహ్నం 1.49 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ నగరపాలకసంస్థ కార్యాలయంలో తాత్కాలికంగా కేటాయించిన చాంబర్‌లో ఆయనతో పాటు ముగ్గురు డైరెక్టర్లు గట్టి సత్యనారాయణమూర్తి, పిల్లి రవి కుమార్ , ఎలిశెట్టి నాగరాజులు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ శ్రీ కార్తికేయ మిశ్రా, గుడా వైస్‌ చైర్మన్‌- రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ వి. విజయరామరాజు, గుడా ప్రత్యేక అధికారి శ్రీ సంజయ్‌ రత్నకుమార్‌, పట్టణ ప్రణాళిక విభాగం సంయుక్త సంచాలకులు శ్రీ సాయిబాబా అవసరమైన పత్రాలపై సంతకాలు చేయించారు. ముఖ్యఅతిధిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ ఎంపీ శ్రీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు సర్వ శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, దాట్ల బుచ్చిబాబు, పెందుర్తి వెంకటేష్‌, ఎస్‌.వి.ఎస్‌. వర్మ పాల్గొన్నారు.తన రాజకీయ గురువు దివంగత బాలయోగి స్ఫూర్తితో, అలాగే గురు సమానులైన మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, తన రాజకీయ సహచరులు ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చిన రాజప్ప, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో గుడా పరిధిలోని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కాకినాడ ఊరేగింపుగా వెళుతున్న సందర్బంగా మార్గమధ్యంలో రాజానగరం గైట్‌ కళాశాల వద్ద మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కెవివి సత్యనారాయణరాజు, సూరంపాలెం వద్ద ఆయనకు మాజీ ఎమ్మెల్యే, ఆదిత్య విద్యాసంస్థల అధినేత శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అలాగే పోర్చుగీసులో సినిమా షూటింగ్‌లో ఉన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్‌ద్వారా శ్రీ గన్నికృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
తొలుత శ్రీరామనగర్‌లోని తన స్వగృహం నుంచి గన్ని భారీ ప్రదర్శనగా ఆనం కళా కేంద్రం ఎదురుగా ఉన్న పార్టీ నగర కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయానికి ఎంఎల్‌సి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు విచ్చేసి శ్రీ గన్నిని అభినందించారు. ఆర్యాపురం కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ శ్రీ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, ఫ్లోర్‌లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు,అన్నవరం దేవస్థానం డైరెక్టర్ రొబ్బి విజయశేఖర్‌, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌లు రెడ్డి మణి, కురగంటి సతీష్‌, జవ్వాది మురళీకృష్ణ, డాక్టర్‌ అనుసూరి పద్మలత, పరిమివాసు, నాయకులు బుడ్డిగ రాధా, మళ్ళ వెంకట్రాజు, మజ్జి రాంబాబు, ముప్పన రుద్రయ్య, ప్రభాకర్‌, శీలం గోవిందు, రాచపల్లి ప్రసాద్‌; వారాది నాగబాబు, వారాది ఆంజనేయులు, పెనుగొండ రామకృష్ణ, కరగాని వేణు, యార్లగడ్డ శేఖర్‌, టేకుమూడి నాగేశ్వరరావు, బొట్టా వీరబాబు, హుస్సేన్‌ ఆలీ జానీ, పెదకాపు, మరుకుర్తి రవియాదవ్‌, దుర్గాయాదవ్‌, బొచ్చ శ్రీనివాస్‌, అరిగెల బాబూనాగేంద్రప్రసాద్‌, మున్నాబాయి, మార్ని వాసుదేవరావు, గంగిన హనుమంతరావు, తలారి భగవాన్‌, బుడ్డిగ రవి, నున్నా కృష్ణ, వంకా శ్రీనివాసచౌదరి, ఆచంట బాలాజీ, కాకర్ల ప్రసాద్‌, రెడ్డి సతీష్‌, శనివాడ అర్జున్‌, శీలం గోవిందు, శెట్టి జగదీష్‌, సందీప్‌ చౌదరి, మద్ది నారాయణ, ఎం బ్రహ్మయ్య, ఎస్‌ రాజారావు, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, చోడే రాధా, తురకల నిర్మల, మునికోటి వెంకటేశ్వరరావు, కర్రి రాంబాబు, రాణా ఉదయ్‌, మద్దు సతీష్‌, కేదారిశెట్టి గోవిందు, విశ్వనాధరాజు, పొన్నమాటి బాబ్జి, కరుటూరి అభిషేక్‌, జెస్సీ, జక్కంపూడి అర్జున్‌, పితాని కుటుంబరావు, బత్తుల శ్యామలరావు, నిమ్మలపూడి గోవిందు, మత్సేటి ప్రసాద్‌, ఎలిపే జాన్‌, ఆర్యాపురం బ్యాంక్‌ డైరెక్టర్‌లు సూరంపూడి శ్రీహరి, పోలాకి పరమేష్‌, పిల్లి శ్యామ్‌కుమార్‌, కార్పొరేటర్‌లు ద్వారా పార్వతి సుందరి, రెడ్డి పార్వతి, పెనుగొండ విజయభారతి, గరగ పార్వతి, పాలవలస వీరభద్రరావు, మాటూరి రంగారావు, యిన్నమూరి రాంబాబు, మర్రి దుర్గాశ్రీనివాస్‌, తంగెళ్ళ బాబి, కొమ్మ శ్రీనివాస్‌, సింహానాగమణి, కప్పల వెలుగుకుమారి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.గోకవరం బస్టాండ్‌ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, దేవిచౌక్‌, అజాద్‌చౌక్‌, గీత అప్సర, సోమలామ్మ గుడి, డీలక్స్‌ సెంటర్‌ మీదుగా కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని అక్కడ పార్టీ వ్యవస్ధాపకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆతర్వాత స్టేడియంరోడ్‌, బైపాస్‌ రోడ్డు, దానవాయిపేట, ఎవి అప్పారావు రోడ్‌, లాలాచెరువు మీదుగా కాకినాడవెళ్ళారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.