How to declare unaccounted money under the P.M. Garib Kalyan Yojana

ఆదాయ పన్ను చెల్లింపుదారులూ … మీ సొమ్ముని శుద్ధి చేసుకోండి
రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ గోపాలరావు సూచన

it
గత ఏడాది నవంబర్ 9న రూ 500, రూ 1000నోట్లు రద్దుచేశాక, కొన్ని ఖాతాల్లో ఇబ్బడి ముబ్బడిగా డిపాజిట్లు పడడం, దేశవ్యాప్తంగా 8లక్షల ఖాతాలను గుర్తించి ఆదాయపు పన్ను శాఖ ఆన్ లైన్ లో నోటీసులివ్వడం, కొన్నింటికి సమాధానాలు రావడం మరికొన్నింటికి రాకపోవడం జరిగాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన’ ద్వారా వెల్లడి చేయని ఆదాయం నగదు నిల్వల రూపంలో ఉన్నా, బ్యాంకుల్లో జమ చేసినా, డిపాజిట్లు రూపంలో ఉన్న వాటిపై డిక్లరేషన్‌ ఇచ్చి కేవలం 49.9 శాతం పన్ను చెల్లించి, 25 శాతం తిరిగి చెల్లించేబడే డిపాజిట్‌ రూపంలో ఆయా బ్యాంకుల్లో మదింపు చేసి సొమ్మును శుద్ధిపరుచుకోవాలని రాజమహేంద్రవరం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈమేరకు  రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ శ్రీ జి.వి.గోపాలరావు  రాజమహేంద్రవరం హోటల్ వెంకీ డిలైట్ లో జాయింట్‌ కమిషనర్‌ శ్రీ  నారాయణరావు తదితరు లతో కల్సి సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదాయపన్ను శాఖ ఇప్పటికే ఆన్‌లైన్‌లో పంపిన ప్రశ్నలకు, ఇతర నోటీసులకు సత్వరమే స్పందించి ఈనెల 31లోగా డిక్లరేషన్‌ను దాఖలు చేయాలని అభ్యర్ధించారు. 31 తరువాత ఆదాయ పన్ను శాఖ తనిఖీలలో గాని, విచారణలో గాని వెల్లడి చేయని ఆదాయాన్ని నిర్ధారణ చేసిన యెడల గరిష్టంగా 137.25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. పిఎంజికెవై – 2016 ద్వారా ప్రతి ఒక్కరూ తమ ధనాన్ని శుద్ధిపరుచుకోవాలని ఆయన కోరారు. ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత నల్లధనం వెలికితీతకు అనేక చర్యలు చేపట్టారన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో 20వేలమందికి నోటీసులు ఇచ్చామని వారిలో 50 శాతం మంది సమాధానం ఇచ్చినప్పటికీ అవి సంతృప్తికరంగా లేవన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన – 2016కు మంచి స్పందన వస్తోందని, గడువు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

it0

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=income+tax+pradhan+mantri+garib+kalyan&* 

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59j69i57j0.2771j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.