implementation of the Andhra Pradesh Reorganisation Act

విభజన చట్టం అంశాల అమలుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
ఎపి ఎంపీలు కూడా దీనిపై గళమెత్తాలి :ఉండవల్లి

undavalli
ఆంద్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాల అమలుకోసం రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణకుమార్ కోరారు. ఈమేరకు రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసారు. లేఖ అందినట్టు తాకీదు కూడా రావడంతో రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో శుక్రవారం ఉదయం సర్వశ్రీ చెరుకూరి వెంకట రామారావు, పొడిపిరెడ్డి అత్యుత దేశాయి, అల్లు బాబి, నక్కా శ్రీనగేష్,నూక శ్రీనివాస్, ఎం కృష్ణ, లింగంపల్లి వెంకటేశ్వరరావు తదితరులతో కల్సి శ్రీ ఉండవల్లి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఆంద్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 108ప్రకారం చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంతో జరుగుతున్న జాప్యం మూడేళ్లు అయితే, రాష్ట్రపతి జోక్యం చేసుకుని, వాటిని అమలు చేసే అధికారం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి జూన్ రెండు నాటికి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి కి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కాలరీస్,ఫిలిం డవలప్ మెంట్ కార్పొరేషన్,ఫారెస్ట్ డవలప్ మెంట్ కార్పొరేషన్,ఆర్ టి సి ,జెన్ కో,ట్రాన్స్ కో …. ఇలా మొత్తం 89వ్యాపార సంస్థల్లో ప్రజలు భాగస్వాములుగా వున్నారని, విభజన చట్టం ప్రకారం జనాభా దామాషాలో ఏపీకి 52శాతం , తెలంగాణాకు 42శాతం వాటా చెందుతాయని అయితే ఇందులో చాలావరకూ ఇప్పటికీ విభజన అవ్వలేదని ఆయన గుర్తుచేసారు. అలాగే షెడ్యూల్ 10ప్రకారం 107 సంస్థలలో కూడా ఇలాగే విభజన చేయాల్సి ఉందని ఆయన అన్నారు. వీటి గురించి చంద్రబాబు అడగడం లేదన్నారు. తన లేఖలోని అంశాలను ఏపీకి చెందిన అన్నిపార్టీల ఎంపీలు పరిగణనలోకి తీసుకుని విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించాలని ఆయన సూచించారు.
జిడిపి పెరిగి … రెవెన్యూ తగ్గడమా/
ఆంధ్రప్రదేశ్ లో జిడిపి పెరిగిపోతున్నట్టు చూపించి, రెవెన్యూ తగ్గిపోతున్నట్టు చెప్పడం వింతగా ఉందని శ్రీ ఉండవల్లి వాపోయారు. అసలు ఇదెలా సాధ్యమో చెప్పాలన్నారు. ధారా సింగ్ లా, కోడి రాంమూర్తిలా ఉన్నామని చెప్పుకుంటూ మా దగ్గర తినడానికి ఏమీ లేదంటే, ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉందని ఆయన చురకలంటించారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే నష్టమేమిటంటూ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రశ్నించడం వింతగా ఉందన్నారు. 2015-16 కేటాయింపులు చూస్తే ,ప్రత్యేక హోదా గల 11రాష్ట్రాల్లో ఒక లక్షా 50వేల860కోట్లు కేటాయిస్తే,5కోట్లు జనాభా గల ఏపీకి ఈలెక్కన లక్ష కోట్లు కేటాయించాల్సి ఉంటే, కేవలం 40వేల460కోట్లు మాత్రమే ఇచ్చారని శ్రీ ఉండవల్లి చెబుతూ ఆర్ బి ఐ టేబుల్ లో ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. జిడిపి పెరిగి , రెవెన్యూ తగ్గిపోయిందనడం చూస్తుంటే పట్టిసీమ యవ్వారం గుర్తొస్తోందన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాకు మళ్లించిన నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని, ఒకవేళ ఇది తప్పయితే చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.
అసెంబ్లీ చర్చల కన్నా టివి చర్చలే మిన్న !
ఎపి అసెంబ్లీలో జరుగుతున్న చర్చల తీరు చాలా దారుణంగా ఉందని శ్రీ ఉండవల్లి పేర్కొంటూ, వీటి కన్నా టీవీల్లో జరిగే చర్చలే మిన్నగా ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఏమి అడిగినా లక్ష కోట్లు గురించే ఆరోపణలు గుప్పించడం తప్ప , సమాధానం లేదని ఆయన వాపోయారు. ఇక సీఎం ప్రతిజ్ఞ చేయిస్తుంటే స్పీకర్ కూడా లేచి నిలబడడం దారుణమన్నారు. అలాగే స్పీకర్ తన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తెరమీద సినిమా చూపించడం కూడా బాగోలేదన్నారు. రేపొద్దన్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా కూడా చూపించినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాలంటే రెండు వారాల గడువు ఇవ్వాలని, అయితే ఆ నిబంధన కూడా పక్కన పెట్టేయడం ఎపి అసెంబ్లీకే దక్కిందన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=ap+reorganisation+act+2014&*

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i59.1795j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=undavalli+arun+kumar&*

 

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.