In and Out Showroom Grand opening

 ఇన్ అండ్  అవుట్  షోరూం ప్రారంభం 
in5in2in3in4in
ఇప్పటికే పాతసోమాలమ్మ పుంత రోడ్ లో రామరాజ్ ఆధరైజెడ్ షోరూం నిర్వహిస్తున్న శ్రీ బలభద్ర కృష్ణ మూర్తి గారబ్బాయి శ్రీ రూపేష్ కుమార్  తాజాగా రామ్ రాజ్, జాకీ సంస్థల బ్రాండెడ్ గా  రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ విజయ టాకీస్ లో ఏర్పాటుచేసిన   ఇన్ అవుట్ (ఇన్నర్ అండ్ ఔటర్ వేర్)  షోరూం ని ఎపి  ఐ ఐ సి మాజీ చైర్మన్  శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం  శనివారం సాయంత్రం 5.30గంటలకు ప్రారంభించారు. తొలి కొనుగోలు చేసారు.  అతిధులకు రూపేష్ కుమార్ తో పాటు బలభద్ర రాజా, డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ స్వాగతం పలికారు. ఇన్ అవుట్ కాన్సెప్ట్ లో ఇటు ఎపి, అటు తెలంగాణాలో తొలి షోరూం ఇదే నని  రామ్ రాజ్, జాకీ బ్రాండ్స్ ఇక్కడ లభిస్తాయని రూపేష్ కుమార్ చెప్పారు.  100రూపాయల నుంచి 10వేల రూపాయల వరకూ అన్ని వర్గాల వారికి తమ షోరూం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మంచి సర్వీస్ అందించడం తమ ప్రత్యేకతగా ఆయన చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా షోరూం లు ప్రారంభిస్తామని తెలిపారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దాదాపు 80ఏళ్ళ నుంచి బలభద్ర కుటుంబం వ్యాపార రంగంలో రాణిస్తూ, సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్రవేసిందని అన్నారు. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన రూపేష్ కుమార్ రాజమండ్రిలో రెండు షోరూం లు ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. సాఫ్ట్ వెర్ కంపెనీ నెలకొల్పి ఎందరికో ఉపాధి కల్పించిన రూపేష్ కుమార్, నిర్మాణ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారని ఆయన అన్నారు. రామ్ రాజ్, జాకీ సంస్థల బ్రాండెడ్ గా ఏర్పాటుచేసిన ఈ సంస్థ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. చాంబర్ అధ్యక్షులు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు,మాజీ అధ్యక్షులు  అశోక్ కుమార్ జైన్, పింటోనికా అదినేత శ్రీ సత్యవరపు గోకుల మురళి,శ్రీ విశ్వేశ్వర ఆలయ చైర్మన్ శ్రీ మండవిల్లి శివ, సర్వశ్రీ తొంటేపు రామలింగ స్వామి, వంకాయల శ్రీనివాసరావు, అంజనీ కుమార్ తదితరులు హాజరై, శుభాకాంక్షలు తెలిపారు. 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.