ISKCON jagannadha Ratha yatra in Rajahmundry

కృష్ణ నామ కీర్తనతో జగన్నాధ రథయాత్ర
పురవీధుల్లో ఆధ్యాత్మిక  పరిమళాలు వెదజల్లిన ఇస్కాన్

పులకించిన భక్తజనం – ఆకట్టుకున్న రామాయణ నృత్యరూపకం 

iskconramayanam
ఇస్కాన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర కోటిపల్లి బస్టాండు సమీపంలోని ఆలయ నృత్యకళావనం వద్ద వైభవంగా ప్రారంభమై, పురవీధుల్లో కోలాహలంగా సాగింది. ఇస్కాన్‌ నగరశాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్‌ దాస్‌ నేతృత్వంలో ‘జయ జగన్నాథ.. గోవిందా జయ జయ, గోపాల జయజయ, హరేకృష్ణ హరే కృష్ణ, కృష్ణకృష్ణ హరే హరే నామసంకీర్తనలతో రాజమహేంద్రవరం మార్మోగింది. జగదారాధ్యుడు, జగద్వంద్యుడు, జగదానందకారకుడు, జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు బలరామ, సుభద్రలతో రథంపై ఆశీనుడయ్యాడు. భక్తజన మానసాలను అమందానందకందళిత హృదయారవిందాలను చేస్తూ, రథం కదలింది. ముందుగా నిర్వాహకులు గుమ్మడికాయలు కొట్టి, హారతులు ఇచ్చి రథయాత్రను ప్రారంభించారు. రూరల్‌ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైయస్సార్‌ సి.పి సిటీ కన్వీనర్‌ రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్‌ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వీరరాఘవమ్మ దంపతులు, నగర మేయర్‌ పంతం రజనీశేషసాయి, ఆర్యాపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ శ్రీ చల్లా శంకరరావు, శ్రీ తోట సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సాగుతూ ఏకతాటిపై నడిపేదే జగన్నాథ రథయాత్రగా అభివర్ణించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఖ్యాతిగాంచిన ఇస్కాన్‌ సేవాకార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ఇస్కాన్‌ అధ్యక్షుడు శ్రీ సత్యగోపీనాథ్‌దాస్‌ మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని చాటిచెబుతూ వివక్షకు తావులేకుండా జరగటమే రథయాత్ర లక్ష్యంగా పేర్కొన్నారు. రథం వెళ్లే మార్గాన్ని ప్రజాప్రతినిధులు లాంఛనంగా, సంప్రదాయాన్ని అనుసరించి కొద్దిమేర శుభ్రం చేశారు. రథమార్గమంతటా భక్తులు పూలవాన కురిపించారు. 70 దేశాల నుంచి తరలి వచ్చిన సుమారు 200మంది భక్తులు రథయాత్రలో పాల్గొని నృత్యాలు చేస్తూ, నందగోపాలుడిని స్మరించారు. కేరళరాష్ట్రం నుంచి వచ్చిన సంప్రదాయ కళాకారులు, విచిత్రవేషధారణలలో సంప్రదాయ కళాకారులు పాల్గొన్నారు. జోడుగుర్రాల ప్రత్యేక వాహనంపై ఇస్కాన్‌ స్థాపనాచార్యులు భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. కోటిపల్లి బస్టాండు, మెయిన్‌ రోడ్డు, కోటగుమ్మం, జండాపంజారోడ్డు, దేవీచౌక్‌లమీదుగా రథం ఆనం కళాకేంద్రం చేరుకుంది. దారిపొడవునా భక్తులు రధాన్ని లాగుతూ తన్మయత్వం చెందారు. రథానికి స్వాగతం పలుకుతూ అడుగడుగునా రంగవల్లులు తీర్చిదిద్దారు.  
    అనంతరం ఆనం కళాకేంద్రంలో వీదేశీయులు ప్రదర్శించిన రామాయణం నృత్య రూపకం విశేషం ఆకట్టుకుంది. సుమారు 45 నిమిషాలు సాగిన ఈ నృత్యరూపకంలో 35 పాత్రలున్నాయి. నృత్య రూపకం తిలకిస్తూ ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేసారు. కళా కేంద్రం బయట స్క్రీన్లు ఏర్పాటుచేయడంతో చాలామంది తిలకించారు. పెద్దఎత్తున ప్రసాద వితరణ చేసారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=iskcon&*

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59l2j69i57.2635j0j7&sourceid=chrome&ie=UTF-8

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.