ISKCON Rajahmundry Iskcon Ratha yatra 2017

రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ నుంచి ఆనం కళాకేంద్రం వరకూ
మార్చి 17న జగన్నాధ రథయాత్ర – ఇస్కాన్ భారీ ఏర్పాట్లు
హాజరవుతున్న 250మంది విదేశీ భక్తులు

isconsatyagopeenadh
 ఇస్కాన్ స్వర్ణోత్సవం సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా 4వేల నగరాల్లో రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా  రాజమహేంద్రవరం గౌతమ ఘాట్ లోని ఇస్కాన్ మందిరం ఆధ్వర్యాన కోటిపల్లి బస్టాండ్ నుంచి ఆనం కళా కేంద్రం వరకూ మార్చి 17న జగన్నాధ రథయాత్ర నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఇస్కాన్ భారీ ఏర్పాట్లు చేస్తోందని రాజమండ్రి ఇస్కాన్ అధ్యక్షులు శ్రీ సత్య గోపీనాధ్ దాస్ చెప్పారు. ఇస్కాన్ లో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో మొదటిగా 2003లో జగన్నాధ రథయాత్ర నిర్వహించామని, ఆతర్వాత 2007,2012లలో కూడా నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు నిర్వహించే రథయాత్రకు దాదాపు 70దేశాల నుంచి 250మంది పాశ్చా త్యులు విచ్చేస్తున్నారని ఆయన చెప్పారు. జగన్నాధ రథయాత్రలో పాల్గొన్నా, రధం లాగినా, రధాన్ని ఇంటికి ఆహ్వానించినా సమస్త పాపాలనుంచి విముక్తులవుతారని ఆయన అన్నారు. ఆరోజు మధ్యాహ్నం 3గంటలకు కోటిపల్లి బస్టాండ్ లో రథయాత్ర మొదలవుతుందని, మెయిన్ రోడ్, కోటగుమ్మం,జండాపంజా రోడ్,జాంపేట సెంటర్,నందం గనిరాజు జంక్షన్,మీదుగా, కంబాల చెర్వు,దేవీచౌక్,గోకవరం బస్టాండ్ నుంచి శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేద్రం వరకూ యాత్ర సాగుతుందని ఆయన తెలిపారు.
,కేరళ నుంచి ధ్వని వాయిద్య కళాకారులు,పొడవాటి మనుషులు,అన్నమయ్య కీర్తనల భజన బృందాలు,కోలాటం,గరగలు, భేరీ గ్రూప్,చిడతల భజన,ఏలూరు నుంచి 22మంది కళాకారులతో అష్టలక్ష్మీ అవతారాల ప్రదర్శన,హరిదాసులు,గంగిరెద్దులు,డోలు,సన్నాయి తదితర కళా బృందాలన్నీ యాత్రలో ముందు వరుసలో వుంటాయని శ్రీ సత్యగోపీ నాధ్ దాస్ చెప్పారు. సాయంత్రం కళా కేంద్రంలో శ్రీ హెచ్.హెచ్. త్రిదండి శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ ‘జగన్నాధ లీలల’పై ప్రవచనం చేస్తారని తెలిపారు, అనంతరం మహా ప్రసాద వితరణ వుంటుందని తెలిపారు.
18న జి దొంతమూరులో గౌర నితాయి దేవాలయం ప్రారంభం
కాగా తూర్పు గోదావరి జిల్లా జి దొంతమూరు గ్రామంలోని దక్షిణ గిరి,గోవర్ధన క్షేత్రంలో ఈనెల 18న శ్రీ శ్రీ బలరాం గౌర నితాయి దేవాలయం ప్రారంభిస్తున్నట్లు శ్రీ సత్య గోపీనాధ్ దాస్ చెప్పారు. ఆరోజు ఉదయం 8గంటలకు అనపర్తి నుంచి ఇస్కాన్ భక్తులు సంకీర్తన చేస్తూ, వస్తారని,10గంటలకు జి దొంతమూరులో ఆలయ ప్రారంభం అవుతుందని వివరించారు. అనంతరం మహా ప్రసాద వితరణ వుంటుందని తెలిపారు.
19,21లలో శ్రీమద్ రామానుజుల వారి సహస్రాబ్ది
శ్రీ మద్ రామానుజులవారి సహస్రాబ్ది సందర్భంగా 19న కాంచీపురం, 21న శ్రీ పెరంబదూర్ లలో వేడుకలు జరుగుతాయని శ్రీ సత్య గోపీనాధ్ దాస్ చెప్పారు.

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ra&aqs=chrome.2.69i60j69i59l3j69i60j69i61.2283j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=iskcon+ratha+yatra+2017&*

https://www.google.co.in/search?q=sarikothasamacharam&oq=sa&aqs=chrome.2.69i60l2j69i59j69i60j69i59j69i60.1884j0j7&sourceid=chrome&ie=UTF-8

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.