Jaipal Reddy told truth!?

నాది కట్టు కధే .. మరి జైపాల్ రెడ్డి నిజం ఏమిటో చెప్పాలి
‘విభజన కధ’ పుస్తకంపై విమర్శలను ప్రస్తావిస్తూ ఉండవల్లి వ్యాఖ్య

arun2arun
‘నేను ఊహించి కట్టు కధే రాసా. అయితే నిజం ఏమిటో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చెప్పాలి’ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సాగిన సంఘటనలపై ‘విభజన కథ’ పేరిట మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఓ పుస్తకాన్ని రాసారు. దాదాపు 300 పేజీలతో రూపుదిద్దనున్న ఈ పుస్తకాన్ని సెప్టెంబర్18 ఆదివారం హైదరాబాద్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆవిష్కరించారు. అయితే ఉండవల్లి రాసిన పుస్తకం విభజన కథ ఓ కట్టు కథ అని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి విమర్శించారు. దీనిపై ఉండవల్లి స్పందిస్తూ, వైజంక్షన్ ఆనం రోటరీ హాలులో శుక్రవారం ఉదయం నక్కా శ్రీనగేష్, బయ్యా జోసఫ్‌రాజు, అశోక్‌కుమార్‌ జైన్‌, లింగంపల్లి వెంకటేశ్వరరావు, కుంపట్ల అమరనాధ్‌, పసుపులేటి కృష్ణ,  అశోక్ కుమార్ జైన్, తదితరులతో కల్సి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.
నేను పుస్తకం ప్రారంభంలోనే స్పీకర్ చాంబర్లో జరిగిన విషయాలను ఊహించి రాస్తున్నట్టు పేర్కొన్నానని ఉండవల్లి గుర్తుచేస్తూ, ఇంకా కట్టు కధ అనడం ఎందుకని, అయినా అసలు నిజం ఏమిటో చెప్పేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. ఆరోజు జరిగిన విషయాలను సున్నితంగా పేర్కొనడం, ఇప్పుడు నా పుస్తకం పై స్పందించడం చూస్తుంటే, జైపాల్ రెడ్డి అసలు నిజాన్ని దాచుకోలేక బయటకు చెప్పాలన్న ఆతృత కనిపిస్తున్నట్టు ఉందని శ్రీ ఉండవల్లి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్ధంగా విభజన జరిగిందా లేదా అన్నదే నా ప్రశ్న, దానికి సమాధానం జైపాల్ రెడ్డి చెప్పాలి అని ఆయన అన్నారు. ఆర్ధిక నిజాయితీ కలిగిన రాజకీయ నాయకునిగా ఉండవల్లి అంటే తనకు అభిమానం ఉందని జైపాల్ రెడ్డి లాంటి టాప్ టెన్ జీనియస్ సర్టిఫికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని ఉండవల్లి అన్నారు.
కేసీఆర్ దీక్ష విరమించాక కూడా ఇంకా దీక్ష చేస్తున్నట్టు, ప్రమాదం ముంచుకొస్తున్నట్టు చెప్పబట్టే తెలంగాణా ప్రకటన వచ్చిందని సాక్షాత్త్తూ జైపాల్ రెడ్డి గతంలో చెప్పారని, అలాగే 2014 ఫిబ్రవరి 18న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాధ్, అప్పటి ప్రతిపక్ష నేత సుష్మ స్వరాజ్ ల మధ్య బిల్లు విషయమై సయోధ్య కుదిర్చానని కూడా జైపాల్ చెప్పారని అందుకే ఆరోజు ఏమి జరిగివుంటుందో ఊహించి రాశానని ఉండవల్లి అన్నారు. సున్నితమైన అంశం అని జైపాల్ చెబుతున్నారని అయితే అది చెప్పకూడనిది అయితే కుట్ర కిందే లెక్కని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ప్రత్యేక హోదాపై బిజెపి మాట మార్చడం, సీఎం శ్రీ చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పేసుకోవడం గురించి శ్రీ ఉండవల్లి ప్రస్తావిస్తూ, ఏపి నుంచి కేంద్రానికి వెళుతున్న పన్నుల సొమ్మును ఏపికే వినియోగించేలా ఆదేశాలు ఇవ్వవచ్చు కదా అన్నారు. అయినా ఎక్కడైనా స్థానిక ఎన్నిక , ఉప ఎన్నికో జరిగితే, హోదా కావాల్సినవాళ్లు కల్సి పోటీచేస్తే, అప్పుడు ప్రజా తీర్పు ఏమిటో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=vundavalli%20aruna%20kumar

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=state+reorganization

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.