Kathanayika Molla statue on Godavari Bund

గోదావరి గట్టున మొల్లకు ఆలయం: శిల్పి వుడయార్‌

molla1mollamollao
మార్చి 13న కవయిత్రి మొల్ల జయంతి ఉత్సవం రాజమహేంద్రవరం నగర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సరస్వతీఘాట్‌లో ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన శిల్పి రాజకుమార్‌ వుడయార్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది నాటికి గోదావరి గట్టున ఆమెకు ఆలయాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. శిల్పి వుడయార్‌ రూపుదిద్దిన విగ్రహాన్ని తాత్కాలికంగా ప్రత్యేక వేదికపై అమర్చారు. శిల్పి వుడయార్‌ మాట్లాడుతూ మొల్ల రచించిన రామాయణం పండితపామర రంజకంగా అందరినీ అలరిస్తుందన్నారు. శ్రీ ఫణి నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహిస్తూ, సహజకవి పోతనామాత్యునికి సాహిత్య వారసురాలిగా మొల్లను పేర్కొన్నారు. మొల్ల తన రామాయణంలో ‘చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పల్కు మీర చెప్పెద నేనెల్లప్పుడు..’ అని పేర్కొన్నారని, ఇది పోతనామాత్యుడు ఆంధ్రభాగవత రచనలో చెప్పిన ‘పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట..’ అన్న పద్యంతో సరితూగుతుందని అన్నారు. ప్రతి తెలుగవాడు మొల్ల రామాయణాన్ని, మొల్ల జీవితచరిత్రను తప్పని సరిగా అధ్యయనం చేయాలని కోరారు. శ్రీ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ సాహిత్యం కొందరి ఏకఛత్రాధిపత్యంలో వెలుగుతున్న రోజుల్లో– స్త్రీవిద్య వెలుగు చూడని సమయంలో మొల్ల తెలుగులో రామాయణం రచించడం విశేషమన్నారు. శ్రీ పేరూరి గంగాధరం మనుమరాలు పేరూరి అలేఖ్య మొల్ల వేషధారణలో కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ్యులు v మొల్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీజ్ఞానసరస్వతీపీఠం ట్రస్టీ తోట సుబ్బారావు, డాక్టర్‌ ఎల్లా అప్పారావు వుడయార్, రాయపూడి శ్రీనివాసరావు,జుజ్జవరపు కాళేశ్వరరావు, శాలివాహన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

molla50

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=molla&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao&*

https://www.google.co.in/search?q=sarikothasamacharam&oq=sa&aqs=chrome.2.69i60l2j69i59l2j69i60l2.1947j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ra&aqs=chrome.1.69i60j69i59l3j69i60j69i61.1891j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=rajkumar+vadayar&*

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.