‘Oye Ninne’ movie review & rating

హాస్యం మేళవించిన చక్కని కుటుంబ కధా చిత్రం‘ఓయ్‌.. నిన్నే’

oye
తెరంగేట్రం తోనే మంచి నటన కనబర్చిన హీరో “భరత్‌ మార్గాని”

oye.jpg01
రాజమహేంద్రవరం పురప్రముఖులు శ్రీ మార్గాని నాగేశ్వరరావు తనయుడు భరత్‌ మార్గాని తెరంగేట్రం చేస్తూ, నటి సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్‌.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన ‘ఓయ్‌.. నిన్నే’ సినిమా గోదావరి యాసకు అగ్ర తాంబూలం ఇస్తూ, కుటుంబ బంధాల్నిచాటి చెబుతూ,హాస్య రసాన్ని పంచుతూ హృదయాల్ని హత్తుకునేలా సాగింది. తొలిప్రయత్నంలోనే “భరత్‌ మార్గాని” మంచి నటనను ప్రదర్శించి, పల్లెటూరి యాసతో అందరిని ఆకుట్టుకునే పాత్రలో ఒదిగిపోయాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. రాజమహేంద్రవరం ఊర్వశి థియేటర్ లో రాష్ట్ర శాసనమండలి వైస్ చైర్మన్  శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం తో కల్సి హీరో భరత్‌ మార్గాని మార్నింగ్ షో వీక్షించారు. క్రెడాయ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బుడ్డిగ శ్రీనివాస్, గౌడ శెట్టిబలిజ సంఘ నాయకులు శ్రీ రెడ్డి రాజు తదితరులు కూడా సినిమాను వీక్షించారు. హీరో భరత్ కి మంచి భవిష్యత్తు ఉందని పలువురు అభినందించారు.

oye.jpg0
దర్శకత్వం: సత్య చల్లకోటి
నిర్మాత : వంశీకృష్ణ శ్రీనివాస్‌
తారాగణం :
తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేష్, తులసి, ప్రగతి, ధనరాజ్‌ తదితరులు
కెమెరా: సాయి శ్రీరామ్,
సంగీతం: శేఖర్‌ చంద్ర,
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్,
పాటలు : రామజోగయ్య శాస్త్రి,
ఫైట్స్‌: వెంకట్‌.
సినిమా విషయానికొస్తే, ఓ ఊళ్ళో శేఖరం(నాగినీడు) ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, గౌరవంగా జీవిస్తూ, ఊరిఅందరిచేత పెద్దమనిషిగా గుర్తింపు పొందుతాడు. అతని కొడుకు విష్ణు(భరత్‌ మార్గాని)కి చిన్నప్పటినుంచి చదువుపై శ్రద్ద తక్కువ. వ్యవసాయాన్ని నమ్ముకోవాలని అనుకుంటాడు. ఊళ్ళో వాళ్ళ విషయాల్లో తలదూరుస్తూ వారికి ఉపకారం చేస్తుంటాడు. మన సంతోషానికి దగ్గరగా ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటామని విష్ణు నమ్మకం. అయితే అతని చేష్టలు తండ్రి శేఖరానికి నచ్చవు. శేఖరం చెల్లెల్లు కూతురు వేద ( హీరోయిన్ సృష్టి) చిన్నప్పటినుంచి శేఖరం దగ్గరే పెరుగుతుంది. చదువులో ఎప్పుడూ జోరుగా ఉంటుంది. వేదను మహారాణిలా చూస్తూ తనను బానిసగా చూస్తున్నారని విష్ణు తరచూ అంటుంటాడు. వేద, విష్ణులకు ఎప్పుడూ పొసగదు. కానీ అనుకోకుండా వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఇంతలో వేదకు శేఖరం ఓ సంబంధం   చూస్తాడు. అప్పుడు ప్రేమా? కుటుంబమా? రెండిటిలో ఏదో ఒకదాన్నే ఎంపిక చేసుకోమని వేద కోరుతుంది. ఆమె మాట వింటే ప్రేమ… అతని మనసు మాట వింటే కుటుంబం ఉంటుంది. అప్పుడు విష్ణు ఏం చేశాడనే కథతో ‘ఓయ్‌.. నిన్నే’ నడుస్తుంది.
   ‘‘పరశురామ్, చందూ మొండేటి, సుధీర్‌ వర్మ, కృష్ణచైతన్యల వద్ద దర్శకత్వం లో మెళుకువలు నేర్చుకున్న సత్య చల్లకోటి కిదే మొదటి చిత్రం అయినా అనుభవమున్న దర్శకుడిలా ‘ఓయ్‌.. నిన్నే’ను తీర్చిదిద్దాడు. కథను ఎక్కడా పట్టు తప్పకుండా స్క్రీన్ ప్లే పండించాడు. తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయ బేధాలు, బావా మరదళ్ల మధ్య ప్రేమకథ చిత్రానికి హైలైట్‌ గా నిలుస్తాయి. ఇక కామెడీ అదిరింది. రామజోగయ్య శాస్త్రి పాటలు సూపర్. భరత్, సృష్టిలు కొత్తవాళ్లైనా అద్భుతంగా నటించారు. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేష్, తులసి, ప్రగతి, ధనరాజ్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఈ చిత్రం ఎక్కువ భాగం గోదావరి తీరానే చిత్రీకరణ అయింది. ఈ చిత్రం కుటుంబ పరంగా చూడతగ్గ చిత్రంగా,ఎక్కడా అస్లీలతకు తావులేకుండా   మలిచారు. 

https://www.google.co.in/search?q=oye+ninne&oq=oy&aqs=chrome.0.35i39j69i60j0j69i57j69i60l2.3399j0j7&sourceid=chrome&ie=UTF-8

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.