jagruta Procession organised by Pantam Satyanarayana Charitable Trust

పంతం కొండలరావు సారధ్యంలో జాగృత యాత్ర
సామాజిక అభివృధ్ధికోసం అందరి భాగస్వామ్యంతో సంస్థ ఏర్పాటుకి కార్యచరణ

pantam copypantam2 copypantam3 copy

5ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఒక్కో ఏడాది ఒక్కో కార్యక్రమాన్ని జోడించుకుని, అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణం, మొక్కలు నాటడం, జీవ రక్ష, వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏప్రియల్ 4 మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం నుంచి ట్రస్ట్ చైర్మన్ శ్రీ పంతం కొండలరావు సారధ్యంలో పురవీధుల్లో జాగృత యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ రూపిందించిన కరపత్రాన్ని ఆర్యాపురం అర్బన్ బాంక్ చైర్మన్ శ్రీ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు చాంబర్ పూర్వాధ్యక్షులు శ్రీ మారిశెట్టి వెంకట రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ బైర్రాజు ప్రసాద రాజు, శ్రీ ఎస్ ఎన్ రాజా, తదితరులు ఆవిష్కరించారు. డిఎస్పీ శ్రీ కులశేఖర్, డాక్టర్ అరిపిరాల నారాయణరావు, పెరుమాళ్ళ రఘునాధ్, చాంబర్ అధ్యక్షులు శ్రీ బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సర్వశ్రీ కొల్లేపల్లి శేషయ్య, అశోక్ కుమార్ జైన్, తొక్కుల రామాంజనేయులు, నందెపు శ్రీనివాస్, బుడ్డిగ శ్రీనివాస్, ప్రసాదుల హరినాధ్, వాసంశెట్టి గంగాధరరావు, రుంకాని వెంకటేశ్వరరావు, కేశవభట్ల శ్రీనివాసరావు, తోట సుబ్బారావు, ఆదిత్య నాగేశ్వరరావు, కొండేటి భీమారావు,అల్లు రాజేశ్వరి,అల్లు బాబీ, యెనుముల రంగబాబు,నాగులాపల్లి లక్ష్మణరావు,చవ్వాకుల వీర్రాఘవరావు, రేలంగి సత్యనారాయణ, ఏడిద జనేశ్వరరావు, పోలు విజయలక్ష్మి, మార్గాని రామకృష్ణ గౌడ్,ఇమంది శ్రీరాములు, ఎం నాగేశ్వరరావు, ఆకుల ప్రకాష్, ముళ్లా మాధవ్, వేమన నాగభూషణం,గంధం భైరవస్వామి, ఆకుల రాంబాబు, కేబుల్ ఆపరేటర్లు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం , నండూరి రమణ, నండూరి సుబ్బారావు, నొడగల సుధ, తాళం శ్రీను , సీసీసీ మేనేజర్ శ్రీ వంక రాజేంద్ర, బులుసు ప్రకాష్, పంతం శ్రీను, నామన వాసు, చప్పటి సత్యనారాయణ, దేశిరెడ్డి బలరామ నాయుడు,ఇంకా పలువురు ప్రముఖులు , కేబుల్ ఆపరేటర్లు, మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పంతం కొండలరావు మాట్లాడుతూ, ‘నా తల్లిదండ్రులు,గురువులు, నగర పెద్దలు, స్నేహితులు నాకు నేర్పిన క్రమశిక్షణతో ఓ బాధ్యత గల పౌరునిగా సమాజ సేవ చేయాలన్న సత్ సంకల్పంతో మిత్రులతో కల్సి ట్రస్ట్ ఏర్పాటుచేశాం. తొలి ఏడాది 5గురు విద్యార్థులకు సాయం అందించే విధంగా రూపొంది, ఈ ఐదేళ్లల్లో 100మందికి బాసటగా నిలిచింది. ఇప్పుడు 150మందిని చదివించాలని నిర్ణయించాం. ఇక రెండవ ఏడాది సంక్రాతి సందర్బంగా 100మంది వృద్ధులకు బట్టలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కొనసాగిస్తున్నాం. మూడవ ఏడాది ఎపి సీఎం శ్రీ చంద్రబాబు పిలుపునందుకుని సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించే కార్యక్రమం ప్రారంభించామని ,నాల్గవ ఏడాది మూగ జీవాల దాహార్తి తీర్చడానికి కుండీల ఏర్పాటు చేసాం. అయితే 112సెంటర్స్ లో కుండీలు పెట్టినప్పటికీ 25 సెంటర్లలో సరిగ్గా నీళ్లు పోయడం లేదనే విషయాన్ని గుర్తించి, ఈ ఏడాది కొన్ని సెంటర్లలో పెద్ద సైజు బాక్స్ పెట్టాలని నిర్ణయించాం’అని వివరించారు.
అవినీతి ఎంత ప్రమాదమో ప్లాస్టిక్ వాడకం కూడా అంతే ప్రమాదమని శ్రీ కొండలరావు చెబుతూ, ప్లాస్టిక్ కి బదులు జనపనార, క్లాత్ బాగ్స్ కాగితం సంచులు వాడాలని ప్రజలలో చైతన్యం తీసుకు రావడానికి జాగృత యాత్ర తలపెట్టామని తెలిపారు. అంతేకాకుండా నీటిని పొదుపుగా వాడడం,ఇంకుడు గుంతలను ఏర్పాటుచేయడం ద్వారా నీటి వనరులను నిల్వ చేయడం,చెత్తను చెత్త బుట్టల్లోనే వేసేలా చూడడం,పచ్చదనం – పరిశుభ్రం కోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించడం విషయాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలన్నదే తమ సంకల్పమన్నారు. ఇంకుడు గుంతలకోసం నగరపాలక సంస్థ జరిమానా వసూలు చేస్తున్నా, గుంతలు మాత్రం తవ్వడం లేదని అయితే ఖచ్చితంగా గుంతలు తవ్వాలన్నదే తమ డిమాండ్ అని శ్రీ కొండలరావు చెప్పారు. మొక్కలు నాటి వృక్షాలుగా చేయాలన్న ఉద్దేశ్యం ఉన్నవాళ్లకు వచ్చే వర్షాకాలంలో మొక్కలు అందించబోతున్నామని తెలిపారు. కాగా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించేలా చేయాలని కోరుతూ మరో రధాన్ని, అలాగే షీ టీమ్స్ పై అవగాహన కల్పించే రధం కూడా ఈ యాత్రలో ఉంచారు.
పంతం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాటకంగా కొనసాగిస్తూ, ఇంకా మరింతమందిని భాగస్వామ్యం చేయడానికి నగరపాలక సంస్థ తొలిపాలక మండలి సభ్యులు, ద్వితీయ పాలక మండలి సభ్యులు, అంతకు ముందు కౌన్సిలర్లు గా పనిచేసిన సీనియర్లు, పెద్దలు , సీనియర్ సిటిజెన్స్, ఇలా పార్టీలకతీతంగా అందరితో ఓ సంస్థను నెలకొల్పడానికి కసరత్తు మొదలు పెట్టామని శ్రీ కొండలరావు చెప్పారు. నాలుగైదు నెలల్లో ఇందుకు సంబందించిన కార్యాచరణ తో ముందుకు వస్తామన్నారు. సుబ్రహ్మణ్య మైదానం నుంచి ప్రారంభమైన మోటార్ సైకిళ్లపై జాగృతి యాత్ర పురవీధుల మీదుగా సాగింది.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=pantam+charitable+trust&*

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=sa&aqs=chrome.3.69i60l3j69i59j69i60j69i59.2091j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=rajamahendravaram&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.