Pantham Trust is an unpredictable response to the Laksha Deepotsavam

కార్తిక పున్నమి వేళ నేత్ర పర్వంగా లక్ష దీపోత్సవం 
దీప కాంతులతో కోటిలింగాల ఘాట్ శోభాయమానం 
ప్రజాప్రతినిధులు, ప్రముఖుల హారతి – పోటెత్తిన భక్తులు
శివనామ స్మరణతో మార్మోగిన గోదావరి తీరం
పంతం చారిటబుల్ ట్రస్ట్ పిలుపునకు అనూహ్య స్పందన 
తెలుగు బుక్ ఆప్ రికార్డ్స్ లో లక్ష దీపోత్సవం 
పంతం కొండలరావుకి చినరాజప్ప చేతులమీదుగా అందజేత 

deepotsavam.3deepotsavam7deepotsadeepotsa.jpg2deepotsavam.4deepotsavam6deepotsavam.2
     కార్తికపున్నమి వేళ గోదావరి తీరం శోభాయమానంగా మారింది. ఆకాశంలో వెన్నెల కురుస్తుంటే, రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ కిలో మీటరు పొడవునా లక్ష ప్రమిదలలో దీప కాంతులు పరచుకున్నాయి. శివనామ స్మరణతో మారుమోగింది. గోదావరి పై సాలంకృత పంటుపై పూజలు, సంగీత కచేరి,సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు,వేదపఠనం, గోదావరికి హారతి,ఇలా వివిధ కార్యక్రమాల మేళవింపుతో కార్తీక పున్నమివేళ లక్ష దీపోత్సవం కన్నులపండువగా సాగింది. అలాగే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన నావలు గోదావరిలో విహరిస్తుంటే ఆహ్లాదకరంగా, వర్ణ రంజితంగా కనువిందు చేశాయి. గత ఐదేళ్లుగా పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక పౌర్ణమి లక్షదీపోత్సవం ఈ ఏడాది మరింత భారీ ఏర్పాట్ల మధ్య జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు పగడ్బందీగా చేసిన ఏర్పాట్లతో ప్రజాప్రతినిధులు,ప్రముఖుల నడుమ లక్ష దీపోత్సవం కమనీయంగా సాగింది. సన్నాయి మేళాలతో దేవుని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పంటుమీదకు తీసుకు వచ్చారు.. ఆకాశదీపాలు గోదావరి నది గగన తలంలో దేదీప్య కాంతులతో ధగధగ మెరుస్తున్నాయి…
వేదిక పైకి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చారు. కొబ్బరి కాయ కొట్టారు. పొలసానపల్లి హనుమంతరావు శంఖానాదం గోదావరి తీరంలో ప్రతిధ్వనించింది..మరో పక్కన చంఢవాయిద్యాలు లయబద్దంగా భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.
గోబేరు శ్రీనివాస్ సంగీత కచేరి,వాస్తు జోతిష్య పండితులు పుల్లెల సత్యనారాయణ కార్తీక మాస వైభవం ఆవిష్కరణ,దీపాలతో మహా శివునికి నృత్యాంజలి, పొక్కులూరి శ్రీరామ చంద్రమూర్తి సశ్య బృందంచే వేద పారాయణం,సప్పాయశోద కృష్ణ బృందం నాట్యం,ఆచంట చంద్రశేఖర్ శిష్య బృందం పేరిని శివతాండవం నృత్య ప్రదర్శన అలరించాయి. కాగాడాలు వెలిగించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖా మంత్రి కెఎస్ జవహర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీ మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంఎల్.సి ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణ , సిసిసి ఛానల్ ఛైర్మన్, ప్రముఖ ఆడిటర్ వి.భాస్కర్ రామ్, సుచిత్రా దేవి దంపతులు,డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ చల్లా శంకర్రావు, ఆకుల వీర్రాజు, ఇన్నీసుపేట కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ కోళ్ళ అచ్యుతరామారావు, గౌతమ ఘాట్ ఆద్యాత్మిక సంస్ధల సమాఖ్య ప్రతినిధి తోట సుబ్బారావు,వెంకటేశ్వరా జనరల్ మార్కెట్ ఛైర్మన్ నందెపుశ్రీనివాస్, చాంబర్ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, ఎస్.ఎన్ రాజా, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, టికే విశ్వేశ్వరరెడ్డి,ఆదిరెడ్డి వాసు, ,కొల్లేపల్లి శేషయ్య, ఇంకా పలువురు ప్రముఖులు విచ్చేసారు. స్వామివారిని దర్శించి, గోదావరికి హారతి సమర్పించారు. అదేసమయంలో శంఖానాదం చేయగా, మరో పక్క ఆకాశ విను వీధులలో బాణసంచా వెలుగులు సుందర మనోహర వెలుగులను ఆవిషరించాయి. ఓం నమశ్శివాయ గోదావరి తీరంలో మారుమ్రోగింది. క్రమపద్ధతిలో భక్తుల దీపారాధాన కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. చలపతి గురు స్వామి బృందం స్వామివారికి హారతులు సమర్పించారు.
పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు రాజమహేంద్రవరం గోదావరి తీరాన నిర్వహించిన కార్తీక పౌర్ణమి లక్షదీపోత్సవం తెలుగు బుక్ ఆప్ రికార్డ్స్ బృందం అధ్యయనం చేసింది. తెలుగు బుక్ ఆప్ రికార్డ్స్ నమోదు అవ్వడంతో దృవీకరణ పత్రాన్ని రాష్ర్ట ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు కి అందజేశారు. పలువురు ప్రముఖులు ఈ సందర్బంగా పంతం కొండలరావుని అభినందనలతో ముంచెత్తారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం,నండూరి సుబ్బారావు,నండూరి వెంకటరమణ , తాళం శ్రీను,వంక రాజేంద్ర, వాకచర్ల కృష్ణ, కంచుమర్తి చంటి, బులుసు సూర్యప్రకాష్, పంతం శ్రీను,పడాల శ్రీను, పంతం పవన్, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు,కేబుల్ ఆపరేటర్లు,ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు, వివిధ రాజకీయ పక్షాలకు చెందినవారికి, స్వచ్చంద సేవా సంస్దల ప్రతినిధులకు, కార్పోరేటర్లకు, కేబుల్ ఆపరేటర్లకు, నగర పాలక సంస్ధ అధికారులకు, సిబ్బందికి, పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు సభ్యులకు, స్నేహితులకు, శ్రేయాభిలాషులకు, ఎస్.పి.రాజకుమారి, మున్సిపల్ కమీషనర్ విజయరామరాజు, మున్సిపల్ సిబ్బంది, ఎండో మెంట్సు అధికారులు సుబ్రహ్మణ్యం, సిబ్బంది.. డిఎస్.పి కులశేఖర్, విజయవంత కావడానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కగా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించి పూర్తి స్దాయిలో సహకారం అందించిన పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి,ట్రాఫిక్ పోలీసులకు ఏ కార్యక్రమం చేపట్టిన విజయంవంతం చేయడంలో కృషి చేస్తున్న మీడియా ప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా వారికి, వీడియో జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులకు పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ పంతం కొండలరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.