Postal Department to deliver river water at the doorstep .. krshna pushkaram specail

శుద్ధిచేసిన కృష్ణా పుష్కర జలం
విక్రయానికి తపాలా శాఖ ఏర్పాల్టు – బుకింగ్ ప్రారంభం

krishna
గత ఏడాది గోదావరి పుష్కరాల సందర్బంగా శుద్ధిచేసిన గోదావరి పుష్కర జలాలను తగిన రుసుముతో బట్వాడా చేసిన తపాలా శాఖ ఇప్పుడు కృష్ణా పుష్కరాల సందర్బంగా అర లీటర్ పుష్కర జలంతో కూడిన బాటిల్ 30 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించింది. నేరుగా బట్వాడా చేయడానికి బుకింగ్ కూడా ప్రారంభించింది. జులై 13న ప్రారంభమైన బుకింగ్ 31వరకు కొనసాగుతుంది. ఆగస్టు 12నుంచి 23వరకూ కృష్ణా పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో ఆగస్టు 13నుంచి పుష్కర జలాలు బట్వాడా చేస్తారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఇంచార్జ్ శ్రీ పి ఎస్ చంద్ర శేఖర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని పోస్టాఫీసులలో కృష్ణా పుష్కర జలాలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించామని, ఏ పోస్టాఫీసులో బుక్ చేసుకుంటే, నేరుగా ఇంటికి బట్వాడా చేస్తామని ఆయన సూచించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=postal%20krishna%20pushkara%20water

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.