Selfless civil servant Dr. A.B.

నిస్వార్ధ ప్రజాసేవకుడు డాక్టర్ ఎ.బి.

doctor A (1)doctor A (2)doctor A (3)
అకళంక దేశభక్తుడు,మాజీ మంత్రి,నిస్వార్ధ ప్రజాసేవకుడు డాక్టర్ ఎబి నాగేశ్వరరావు 117వ జయంతి సందర్బంగా రాజమహేంద్రవరంలో వివిధ కార్యక్రమాలు చేసారు. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ సేవా కార్యక్రమాలు జోడించి జరిపిన వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్యాపురం లోని డాక్టర్ ఎబి నాగేశ్వరరావు పార్కు,సీతంపేట డాక్టర్ ఎ.బి. నాగేశ్వరరావు విగ్రహం దగ్గర ఖద్దరు మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రకేసరి ప్రకాశం, పొట్టిశ్రీరాములు తదితరుల విగ్రహాలకు నివాళులర్పించారు. డాక్టర్ అరిపిరాల నారాయణరావు,పెరుమాళ్ళ రఘునాధ్,గ్రంధి రామచంద్రరావు,మాటూరి రంగారావు, సన్నిధానం శాస్త్రి,ఇమంది శ్రీరాములు,కోసూరి చండీప్రియ,నల్లగొండ రవిప్రకాష్,ఫణి నాగేశ్వరరావు,రెడ్డి పార్వతి, రెడ్డి సతీష్, తొక్కుల సురేష్, డాక్టర్ నందిపల్లి జోగేశ్వరరావు, గెజిటెడ్ లైబ్రేరియన్ ఆర్.సిహెచ్. వెంకట్రావు, మండవల్లి శివ,ఓలేటి రవి,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇమంది శ్రీరాములుకు సత్కారం చేసారు. వీరభద్ర పురం సాదు స్త్రీల మఠంలో, కస్తూరిబా ఆశ్రమంలో, గౌతమీ జీవ కారుణ్య సంఘంలో పండ్లు పంపిణి చేసారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.