SP Balu completes half a century of playback singing

25,26లలో శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో
‘ఎస్పీ బాలు సినీ స్వర స్వర్ణోత్సవం’

godavai singersgodavai singers2

yarramothu

పద్మభూషణ్ డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 50వసంతాల సినీ ప్రస్థాన స్వర స్వర్ణోత్సవం పేరిట ధవళేశ్వరం గోదావరి కల్చరల్ క్లబ్ ఆధ్వర్యాన రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఈనెల 25.2తేదీలలో పాటల కార్యక్రమం జరుగుతుంది. సినీ హాస్య నటుడు నిర్మాత పద్మనాభం 1966లో నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రంద్వారా ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎస్పీ కోదండపాణి ఆశీస్సులతో ‘ఏమి ఈ వింత మొహం’ అనే పాటతో సినీ గాన ప్రస్తానం ప్రారంభించిన శ్రీ బాలు 2016వరకూ వివిధ భాషల్లో 45వేల పాటలు పాడారు. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎందరో గాయకులను తీర్చిదిద్దారు. తిరుగులేని గాయకునిగా నిలిచి,పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలు అందుకున్నారు. అటువంటి శ్రీ బాలు గారి స్వర మధురిమలు ఆబాల గోపాలాన్ని అలరింప జేయడానికి, తెలుగువారి కీర్తిని మరింత ఇనుమడింప జేయడానికి క్లబ్ ఈ కార్యక్రమం తలపెట్టింది. నెలకు రెండుమూడు కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశ్యంలో గోదావరి కల్చరల్ క్లబ్ ని స్థాపించారు, ముందుగా సంగీతం సమాజసేవకే అని చాటిన ఘంటసాల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించారు, అయితే ఎస్పీ బాలు సినీ స్వర స్వర్ణోత్సవం చేయాలని సంకల్పించారు. ఈనెల 24, 25తేదీలలో రెండు రోజులపాటు కళా కేంద్రంలో ప్రతిరోజూ సాయంత్రం 6గంటలకు పాటల కార్యక్రమం జరుగుతుంది. తొలిరోజు మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొంటారు. రెండవరోజు సినీ గేయ రచయిత శ్రీ వెన్నెలకంటి తదితరులు హాజరవుతారని వివరించారు. తొలిరోజు 25పాటలు,రెండవరోజు 25పాటలు ఆలపిస్తారు. ప్రముఖ కళాకారులు , గాయకులు హాజరవుతారు. ఈసందర్బంగా సమాజ సేవకులు రోటేరియన్ పట్టపగలు వెంకట్రావు,సంగీత విద్వాంసులు శ్రీ త్యాగరాజు,చిత్రకారుడు శ్రీ తాడోజు హరికృష్ణ,కృష్ణా జిల్లాకు చెందిన భానులకు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఉగాది, కళా పురస్కారాలు అందజేస్తారు. ఈకార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆకాశవాణి గాయకులు శ్రీ జివి రమణ,గోదావరి కల్చరల్ క్లబ్ అధక్షులు శ్రీ యర్రమోతు ధర్మరాజు, కార్యదర్శి శ్రీ గాదిరాజు రామరాజు, శ్రీ సూరపురెడ్డి తాతారావు తదితరులు కోరారు.

https://www.google.co.in/search?q=sarikothasamacharam&oq=s&aqs=chrome.3.69i60l2j69i59l2j69i60l2.1963j0j7&sourceid=chrome&ie=UTF-8

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=sp+balu&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.