TDP Mahanadu touched Baahubali

మహానాడుని తాకిన బాహుబలి

 bahubali

 

  ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఇటు కలెక్షన్ల పరంగా , అటు అవార్డుల పరంగా కూడా దూసుకుపోయిన సంగతి తెల్సిందే. దీంతో బాహుబలి -2ని మరింత రక్తి కట్టించేందుకు జక్కన్న కసరత్తు చేస్తుంటే, ఇప్పుడు బాహుబలి ఫీవర్ టిడిపి మాహానాడుని తాకింది. తిరుపతిలో మూడురోజులపాటు తలపెట్టిన మహానాడు శుక్రవారం మొదలైంది. ఈ సందర్భంగా మహానాడు ప్రాంగణం రకరకాల ఫ్లేక్సీలు వెలశాయి. అందులో టిడిపి భవిష్యత్తు నేత , కాబోయే సిఎమ్ గా కీర్తించబడుతున్న చినబాబు నారా లోకేష్ ని బాహుబలి గెటప్ లో ఏర్పాటుచేసిన ఫ్లేక్సీ లు సందడి చేసాయి. పలువురు పార్టీ శ్రేణులు దీని గురించి చర్చించుకున్నారు. గుంటూరు ఎంపి శ్రీ గల్లా జయదేవ్ , మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి ఫొటోలతో పాటు సిఎమ్ శ్రీ చంద్రబాబు ఫోటో కూడా జతచేసి ఈ ఫ్లెక్సీ పెట్టారు. మొత్తానికి బాహుబలి ఫీవర్ పొలిటికల్ వేదికలను చేరింది. మరో కటౌట్ అయితే చంద్రబాబు లోంచి లోకేష్ ని చూపిస్తూ రూపొందించారు. చినబాబుకి మంత్రి పదవి ఇవ్వాలని ఇటీవల కొందరు మాత్రులు సైతం గళం వినిపించిన నేపధ్యంలో మహానాడులో ఏకంగా లోకేష్ హవా కనిపించేలా ఫ్లేక్సీలు , కటౌట్లు వెలిసాయి.

దేవాన్ష్  బొమ్మ సైతం …

Even devans picture

devansh
కాగా సిఎమ్ శ్రీ చంద్రబాబు, నటుడు – హిందూపురం ఎం ఎల్ ఎ శ్రీ ననమూరి బాలకృష్ణ ల మనుమడు, లోకేష్ పుత్రుడు దేవాన్ష్ (ఏడాది బాలుడు) బొమ్మను కూడా కార్యకర్తలు ఫ్లెక్సీ పై వేయడం విశేషం. మొత్తానికి ‘నారా’ వారి భవిష్యత్తు పునాది పటిష్టం గానే ఉండేలా కసరత్తు చేస్తున్నట్టు వుంది కదా.

http://www.telugumovie.co/bahubali-story-leaked-rajamoulis/

,https://www.youtube.com/watch?v=An9KtCmtplg,

https://www.youtube.com/watch?v=r07BsXYbXvY

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.