ugadi celebrations by APUWJ

ఎపియుడబ్ల్యుజె శ్రీరామమూర్తి సార్యధ్యంలో శ్రీ హేమలంబి ఉగాది సంబరాలు


శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏపియుడబ్ల్యూజె తూర్పు గోదావరి జిల్లా కమిటీ అధ్యక్షులు మండెల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గౌతమ ఘాట్ చాంబర్ ట్రస్ట్ కమ్యూనిటీ హాలులో బుధవారం వైభవంగా నిర్వహించారు. పల్లెలో ప్రకృతి సోయగాలు మధ్య జరిగినట్టుగా నిర్వహకులు ఉగాది వేడుకల కోసం వేదిక అలంకరణ తీర్చిదిద్దారు. వేదికను కొబ్బరి ఆకులతో చేసిన అలంకరణ , కొబ్బరిబొండల మధ్య వినాయకుని చిత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలకు ఎపియుడబ్యూజె రాష్ట్ర ఉపాధ్యక్షులు మండెల శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు.సీనియర్ జర్నలిస్ట్ విఎస్ ఎస్ కృష్ణకుమార్ స్వాగతం పలికి సభను నడిపించారు. పిఎంకె సత్రం వేదపాఠశాల విద్యార్ధులు వేదపఠనం చేశారు. ప్రముఖ పండితులు సవితాల సుబ్రహ్మణ్యం పంచాంగ శ్రావణం గావించారు. కార్యక్రమం ఆద్యంతం అత్యంత సంప్రదాయ బద్దంగా, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టుపడే రీతిలో కొనసాగింది. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్యచౌదరి, డా.ఆకుల సత్యనారాయణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సిసిసి ఛానల్ మేనేజింగ్ డైరక్టర్ పంతం కొండలరావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, తెలుగుదేశం నాయకులు గన్నికృష్ణ, కాశీ నవీన్ కుమార్, ఉప్పులూరి జానకిరామ్, ఆదిత్య విద్యాంస్థల డైరక్టర్ ఎస్.పి గంగిరెడ్డి, రొటేరీయన్ పట్టపగలు వెంకట్రావు, వెంకటేశ్వర జనరల్ మార్కెట్ ఛైర్మన్ నందెపు శ్రీనివాస్, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు, వైసీపీ రాజమండ్రి రూరల్ కన్వీనర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర యువజన అధ్యక్షలు జక్కంపూడి రాజా, ప్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, ప్రముఖ అధ్యాత్మిక వేత్త తోట సుబ్బారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ అల్లు బాబి, సినీ దర్శకులు నారాయణ, కాపు కార్పొరేషన్ డైరక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, కార్పొరేటర్లు కోసూరి చంఢీప్రియ, నగర బిజేపీ మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్య సింగ్, వర్రే రాజేష్,(చిన్ని), తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉగాది వేదికపై హెచ్ ఎంటివీ , దిహన్స్ ఇండియా పంచాగాన్ని ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎంపి ఉండవల్లి మేయర్ పంతం ఆవిష్కరించారు. ఆ తర్వాత భక్తి టీవీ పంచాగాన్ని వారు ఆవిష్కరించారు. తర్వాత ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఎస్ బి డిఎస్పీ కుమార్తె కుమారి అలేఖ్య సంప్రదాయ నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జానపద గీతాలు అలపించారు. ప్రముఖులంతా ఉగాది శుభాకాంక్షలు అందజేశారు. పాత్రికేయ కుటుంబాలు కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఉగాది పురష్కరించుకుని కుటుంబంతో కలిసి అక్కడికక్కడే దిగిన దృశ్య ఫొటోను జ్నాపికగా అందజేశారు. ఉగాది సంస్కృతీ సంప్రదాయాలను వివరించారు. ప్రముఖ సమన్వయకర్త నాగిరెడ్డి పిల్లలతో సరదా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ముఖ్యఅతిధులను శ్రీరామమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా గౌరవాధ్యక్షులు కుడుపూడి పార్ధసారధి, జిల్లా కార్యదర్శి టి. శ్రీనివాస్, చిన్నపత్రికల సంఘం జిల్లా అద్యక్షులు జమ్మారమేష్ రాజా వేదికవద్ద తోడ్కుని వచ్చారు. ఏపియుడబ్ల్యూజె రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ఎస్.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిఎ భూషన్ బాబు, ఎపియుడబ్ల్యూజె జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి ఎస్.కృపానందం, అక్రిడియేషన్ కమిటీ సభ్యులు దేవులపల్లి రామలింగం , సీనియర్ రిపోర్టర్లు నవీన్, సాక్షి ఎడిషన్ ఇన్జార్జి కృష్ణారావు, ‌ఎన్టీవీ ఖండవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు వాడ్రేవు దివాకర్ (లోకల్ సాక్షి) వందన సమర్పణ చేశారు. కాగా వేదిక వద్దే తీసిన పాత్రికేయ కుటుంబాల ఫోటోలను సీనియర్ ఫొటో గ్రాఫర్ చిన్ని శ్రీను తయారు చేయించి  రప్పించడంతో  వాటిని సిసిసి మేనేజింగ్ డైరర్టర్ పంతం కొండలరావు చేతుల మీదుగా అందజేశారు.

https://www.google.co.in/search?q=sarikotha+samacharam&oq=s&aqs=chrome.5.69i60l4j69i59l2.2963j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=ugadi+festival+2017&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=raghaveeyam&*

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=mandela+sriramamurty&*

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.